శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jun 05, 2020 , 23:45:11

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

రాంరెడ్డిబావి, కానుకుంటలో రూ.36 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు

గుమ్మడిదల: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో సర్పంచ్‌ వాసవీదామోదర్‌రెడ్డి అధ్యక్షతన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.31.77లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిలో రాంరెడ్డిబావి దూసుకుపోతున్నదని చెప్పారు. అదేవిధంగా కానుకుంటలో సర్పంచ్‌ బేకు నీలమ్మ ఆధ్వర్యంలో రూ.5 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కాగా, ఎర్ర చెరువును మినీ టా్ంయక్‌ బండ్‌గా సుందరీకరణ కోసం రూ.20 లక్షల నిధులతో ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. మండలాన్ని  మోడల్‌గా తీర్చిదిద్దడానికి తాను కృషిచేస్తానన్నారు. అనం తరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సమీపంలో ఉన్న 508 సర్వే నంబర్‌ ప్రభుత్వ భూమిని పరిశీలించారు.  

కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత

పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఇంట్లో కల్యాణ కాం తులు చూడడానికి సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, తాసిల్దార్‌  ఎంపీపీ సద్ది ప్రవీణా భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మంజుల వెంకటేశ్‌గౌడ్‌, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌లు చిమ్ముల నర్సింహారెడ్డి, బేకు నీలమ్మ, ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్‌లు, మొగులయ్య, ప్రవళిక, గోవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు బుద్ధుల పార్వతమ్మయాదగిరి, పద్మాకొండల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, నాయకులు కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి, గోపాల్‌రెడ్డి, మంజుల పాల్గొన్నారు.

కొడకంచిలో రూ.11లక్షల జడ్పీ నిధులతో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జిన్నారం: మండలంలోని కొడకంచి పంచాయతీలో రూ.11లక్షల జిల్లా పరిషత్‌ నిధులతో నిర్మించే అంగన్‌వాడీ భవనం, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే మహి పాల్‌రెడ్డి,  జడ్పీ వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, సర్పంచ్‌ శివరాజ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి జిన్నారం మండలంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కంకణబద్ధులుగా పనిచేస్తున్నామన్నారు. గ్రామాల వారీగా అవసరమైన పనుల వివరాలను గ్రామాల ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకొని పనులు చేపడుతున్నామన్నారు. కొడకంచి గ్రామానికి చెందిన బేగరి శరభయ్య కుటుంబానికి ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువత జిల్లా అధ్యక్షుడు వెంకటేశంగౌడ్‌, తాసిల్దార్‌ దశరథ్‌, ఎంపీడీవో సుమతి, వ్యవసాయ శాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు గోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు గద్దె నర్సిం హ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజేశ్‌, సర్పంచ్‌లు ఆంజనేయులు, ఖదీర్‌, జనార్దన్‌, వెంకటయ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌గౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, బాశెట్టిరాజు, బత్తుల మహేశ్‌, ఇంతియాజ్‌ అహ్మద్‌, మోతకృష్ణ పాల్గొన్నారు.