గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jun 03, 2020 , 22:58:10

‘ఉపాధి’ అక్రమాలపై అధికారుల విచారణ

‘ఉపాధి’ అక్రమాలపై అధికారుల విచారణ

 కొండపాక మండలం బందారం గ్రామంలో విచారణ చేపట్టిన డీఆర్డీవో గోపాల్‌రావు

కొండపాక : మండలంలోని బందారం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ‘ఉపాధి’ పనుల్లో   అక్రమాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులంతా ఇటీవల కలెక్టరేట్‌ను  ముట్టడించారు. బుధవారం డీఆర్డీవో గోపాలరావు ఆధ్వర్యంలో బందారం గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టారు. గ్రామ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్‌ ‘ఉపాధి’ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్‌ నుంచి రూ.లక్ష  రికవరీ చేయగా, మరో రూ.మూడు లక్షల వరకు అవినీతి జరిగినట్లు బహిర్గతం కావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతుందని,  అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో తెలిపారు. ఈ విచారణలో ఎంపీపీ సుగుణ, ఎంపీడీవో రాంరెడ్డి, ఎంపీవో నర్సింహారావు, సర్పంచ్‌ రజిత తదితరులు పాల్గొన్నారు.


logo