శనివారం 11 జూలై 2020
Medak - Jun 03, 2020 , 00:23:31

పట్టణప్రగతిలో సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి

పట్టణప్రగతిలో సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి

మెదక్‌ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతి రెండో విడుతలో మెదక్‌ పట్టణంలోని అన్ని వార్డుల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పట్టణప్రగతిలో భాగంగా రెండోరోజు మెదక్‌ పట్టణం 6వ వార్డులోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో పారిశుధ్యం, రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వార్డుల్లోని  కౌన్సిలర్లు  ప్రజల వద్దకు వెళ్లి  సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, కమిషనర్‌ శ్రీహరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గంగాధర్‌, కౌన్సిలర్లు వనజ, కిశోర్‌, జయరాజ్‌, శ్రీనివాస్‌, మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వనిత, మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు ఉన్నారు. logo