శనివారం 11 జూలై 2020
Medak - Jun 03, 2020 , 00:20:16

దేశానికే దిక్సూచి సీఎం కేసీఆర్‌

దేశానికే దిక్సూచి సీఎం కేసీఆర్‌

  • తెలంగాణ ఆవిర్భావ  వేడుకల్లో  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

మెదక్‌: దేశానికే దిక్సూచి సీఎం కేసీఆర్‌.. దేశ చరిత్రలో ఆయన సువర్ణాక్షరాలతో నిలుస్తారని.. రైతులు లక్షాధికారి కావాలన్నదే ముఖ్యమంత్రి కల అని.. ఉద్యమానికి నా యకత్వం వహించిన వ్యక్తి సీఎంగా ఉండడం గర్వకారణమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మెదక్‌ కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మన వద్ద జరిగిన అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను దేశంలోని ఆయా రాష్ర్టాల్లో అమ లు పర్చడం తెలంగాణకే గర్వకారణమన్నారు.  భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రారంభించే సమయంలో కొందరు అసలు సాధ్యం కాదని అన్నారని గుర్తుచేశారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న పనులను చూసి నివ్వెరపోతున్నారన్నారు. కరోనాతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు అం దించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు.   

రైతులు లక్షాధికారులు కావాలన్నదే సీఎం కల 

సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని,  వారు లక్షాధికారులు కావాలని కోరుకుంటున్నారని మంత్రి అన్నా రు. ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు వేసుకుంటే  కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు దేవుడి సంకల్పం, యాగాలు, పూజలు చేయడంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను విడుతల వారీగా నిర్మించి అర్హులైన పేదలకు ఇస్తున్నామని తెలిపారు.  సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, ఏఎస్పీ నాగరాజు, డీఎస్పీ కృష్ణమూర్తి జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

 వైద్య శ్రీనివాస్‌ను అభినందించిన మంత్రి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వ్యా ఖ్యాతగా వ్యవహరించిన వైద్య శ్రీనివాస్‌శర్మను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అభినందించారు.


logo