మంగళవారం 14 జూలై 2020
Medak - May 30, 2020 , 00:03:41

‘నారింజ’లో పూడికతీత షురూ

‘నారింజ’లో పూడికతీత షురూ

జహీరాబాద్‌: నారింజ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయడంతో పాటు పూడికతీసి నీటి నిల్వ చేసేందుకు పనులు చేస్తున్నామని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్‌ మండలంలోని కొత్తూర్‌(బి)లో ఉన్న నారింజ ప్రాజెక్టులో పూడికతీత పనులను కలెక్టర్‌ హనుమంతరావు, ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూడిక మట్టిని తీసి ట్రాక్టర్లలో వేశారు. 

పర్క్యూలేషన్‌ ట్యాంక్‌గా అభివృద్ధి చేస్తాం..

నారింజ ప్రాజెక్టును పార్క్యూలేషన్‌ ట్యాంక్‌గా అభివృద్ధి చేసి వాన నీటిని నిల్వ చేస్తామని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ అన్నారు. ప్రాజెక్టు గేట్లకు లీకేజీలు ఉండడం, పూడిక నిండిపోవడంతో నీరునిల్వ ఉండడం లేదు. పూడికతీసి, పార్క్యూలేషన్‌ ట్యాంక్‌గా అభివృద్ధి చేయడంతో పుష్కలమై నీరు నిలుస్తుందని తెలిపారు. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. నీటి నిల్వతో జహీరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బోర్లలో పుష్కలంగా నీరు ఉంటుందన్నారు. రైతులు పూడిక మట్టిని తీసుకువెళ్లి పొలాల్లో చల్లుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమేశ్‌బాబు, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు జి.గుండప్ప, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు, ఎంపీటీసీ ఎంజీ.రాములు, గ్రామ సర్పంచ్‌ జగన్‌, టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు సరస్వతీరెడ్డి, తాసిల్దార్‌ నాగేశ్వర్‌రావు, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.logo