బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - May 30, 2020 , 00:03:39

‘తపాస్‌పల్లి’కి కాళేశ్వరం జలాలు

‘తపాస్‌పల్లి’కి కాళేశ్వరం జలాలు

-ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి తపాస్‌పల్లి డ్యాంకు గోదావరి జలాలు పంపింగ్‌ చేసేందుకు త్వరలో చర్యలు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభం సందర్భంగా శాసన మండలి చీప్‌విఫ్‌ బొడెకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపామన్నారు. మల్లన్నసాగర్‌ నుంచి తపాస్‌పల్లికి గోదావరి జలాలు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్‌ సూచించినట్లు చెప్పారు. అలాగే, దేవాదుల పథకంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలాల్లో చేపట్టిన పనుల్లో కొన్ని అసంపూర్తిగా ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోగా, పెండింగ్‌ పనులు వెంటనే పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.  logo