గురువారం 22 అక్టోబర్ 2020
Medak - May 28, 2020 , 23:53:46

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఉమ్మడి మెదక్‌ జిల్లా పశుగణాభివృద్ధి  సంస్థ చైర్మన్‌ గణపలక్ష్మారెడ్డి

సిద్దిపేట అర్బన్‌ : రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, ఈ మేరకు ప్రాజెక్టులు పూర్తి చేస్తూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు అహర్నిశలు కృషిచేస్తున్నారని ఉమ్మడి మెదక్‌ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గణపలక్ష్మారెడ్డి అన్నారు.  గురువారం సిద్దిపేటలో మాట్లాడుతూ గోదావరి జలాలు సిద్దిపేటకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.  మెదక్‌ జిల్లాలో 22 వేల మంది పాడి రైతులు ఉన్నారని తెలిపారు.   పరిశ్రమ అభివృద్ధితోపాటు వ్యవసాయంలో నియంత్రిత సాగు విధానం రైతుల ప్రయోజనం కోసమేనని అన్నారు. తెలంగాణలో వ్యవసాయ సాగువిధానం దేశానికే ఆదర్శంగా మారబోతున్నదన్నారు. 


logo