గురువారం 22 అక్టోబర్ 2020
Medak - May 28, 2020 , 23:50:09

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

  • టీవీఎస్‌ మోటర్‌ బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • తూప్రాన్‌ మండలం నాగులపల్లి  బైపాస్‌ రోడ్డులో దుర్ఘటన 

తూప్రాన్‌ రూరల్‌: మండలంలోని నాగులపల్లి బైపాస్‌ రోడ్డు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. శివ్వంపేట మండలం దంతాన్‌పల్లి నుంచి తూప్రాన్‌ వైపు వస్తున్న టీవీఎస్‌ ఎక్సల్‌ మోటర్‌ బైక్‌ను నిజామాబాద్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న తూప్రాన్‌ సీఐ స్వామిగౌడ్‌, ఎస్సై సుభాష్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తూ ప్రాన్‌ ఎస్సై సుభాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం దంతాన్‌పల్లికి చెం దిన చేకూరి అంజయ్య (49), మైస మ్మ (45) భార్యాభర్తలు వ్యవసాయ పను లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అంజయ్య తన భార్యతో కలిసి టీవీ  బైక్‌పై తూ ప్రాన్‌కు వస్తున్నారు. నాగులపల్లి బైపాస్‌ రోడ్డు సమీపం లో యూటర్న్‌ తీసుకుంటుండగా, అదేసమయంలోని జామాబాద్‌-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో అంజయ్య అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన మైసమ్మను చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్‌ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.  


logo