శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - May 27, 2020 , 02:08:51

సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుచుకుంటాం

సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుచుకుంటాం

తూప్రాన్‌ రూరల్‌: రైతాంగం సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ సూచించిన తరహాలోనే ఈ వానకాలంలో మొక్కజొన్న పంటను సాగుచేయబోమని తూప్రాన్‌ మండలం కోనాయిపల్లి(పీబీ) గ్రామస్తులు మంగళవారం ప్రతిజ్ఞ చేశారు. వ్యవసాయ రంగానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లోనే తామంతా నడుచుకుంటామని ముక్తకంఠంతో రైతు లు చెప్పారు. దీంతో ఈ వానకాలంలో మొక్కజొన్న పంట ను వేయబోమని రైతులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కంకనాల పాండు, ఉప సర్పంచ్‌ రమ్యశంకర్‌, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, రైతులు పాల్గొన్నారు.

వానకాలంలో మొక్కజొన్న పంట వద్దు

చిలిపిచెడ్‌: వానకాలంలో పత్తిపంట, సన్న రకం వరి సాగు విస్తీర్ణాన్ని పెంచాలన్ని ఏవో రాజశేఖర్‌గౌడ్‌ రైతులకు సూచించారు. మంగళవారం శీలాంపల్లి, రహీంగూడ తండాలో నియంత్రిత పంటసాగుపై సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఏవో మాట్లాడుతూ మొక్కజొన్న పంటను వేయవద్దని పేర్కొన్నారు.