మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - May 26, 2020 , 01:53:49

అమీన్‌పూర్‌లో ‘కరోనా’ కలకలం

అమీన్‌పూర్‌లో ‘కరోనా’ కలకలం

  •  మూడు రోజుల కింద తమిళనాడుకు వెళ్లిన మహిళ
  • అనారోగ్యంతో దవాఖానలో చేరడంతో పాజిటివ్‌గా నిర్ధారణ
  • అప్రమత్తమైన అధికారులు, గ్రామస్తులు 

అమీన్‌పూర్‌ : తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఉద్యోగరీత్యా అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని సాయిభగవాన్‌ కాలనీలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం సొంత రాష్ట్రం తమిళనాడుకు వెళ్లారు. ఆ కుటుంబంలోని మహిళ అనారోగ్యానికి గురికాగా అక్కడి దవాఖానకు వెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. మిగితా కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చినట్లు తమిళనాడు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, కమిషనర్‌ సుజాత, మున్సిపల్‌ చైర్మన్‌  పాండురంగారెడ్డి సిబ్బందితో కలిసి సాయిభగవాన్‌ కాలనీ, పరిసరాలను రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించారు. వారితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను తెలుసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.


logo