మంగళవారం 26 మే 2020
Medak - May 24, 2020 , 02:27:47

అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

హత్నూర /నర్సాపూర్‌ రూరల్‌ : అభివృద్ధి పనులకు ప్రతిఒక్కరూ పార్టీలకతీతంగా సహకరించాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన హత్నూర, దౌల్తాబాద్‌ గ్రామాల్లో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు నస్తిపూర్‌లో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, వాటర్‌ ఫిల్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణం పనులు త్వరతగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీడీవో సరళ, సర్పంచ్‌లు వీరస్వామిగౌడ్‌, వెంకటేశం, ఎల్లయ్య, ఎంపీటీసీలు రాజేందర్‌, ఇందిర, వీరేశం, కిషన్‌రావు, టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, మండలశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు మధు పాల్గొన్నారు. 

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత..

ఇటీవల రోడ్డు ప్రమాదంలో నర్సాపూర్‌ పట్టణానికి చెందిన మత్స్యకారులు గుని శ్రీహరి, రుస్తుంపేట్‌కు చెందిన బోయి నర్సింహులు మృతి చెందారు. శనివారం నర్సాపూర్‌ క్యాంప్‌ కార్యాలయంలో మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున నగదు అందజేశారు. మిగతా రూ.3 లక్షలు త్వరలోనే అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


logo