మంగళవారం 26 మే 2020
Medak - May 24, 2020 , 02:19:01

ఫ్రైడే.. డ్రైడే

ఫ్రైడే.. డ్రైడే

  • ప్రతి గ్రామంలో ‘పల్లె ప్రగతి’ని కొనసాగించాలి 
  • వానకాలంలో సీజనల్‌ వ్యాధులపై జాగ్రత్త 
  • మెదక్‌ జిల్లా మల్కాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
  • వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మెదక్‌ నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మెదక్‌ జిల్లాలోని మల్కాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులందరూ గ్రామాన్ని చూసి రావాలని కోరా రు. అనంతరం మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 469 గ్రామాల్లో పల్లెప్రగతి పనులు జరుగుతున్నాయని వివరించారు. దోమల నివారణకు ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సూ చించామన్నారు. గ్రామాల్లో వారానికొకసారి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు. మురుగు కాల్వల్లో పూడికతీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని ఎత్తిపోయడం వంటి కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా చేపట్టినట్లు చెప్పారు. అలాగే, ఉపాధి హామీ పథకం కింద కొత్తగా జాబ్‌కార్డులు జారీ చేశామని, ఈ పథకంలో  కెనాల్‌ పనులు, వాటర్‌ కన్జర్వేషన్‌ పనులు ప్రారంభించామని తెలిపారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో వైకుంఠధామాలు, నర్సరీల్లో పనులు జరుగుతున్నాయని, ఇంటింటికీ తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారని కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. కార్యక్రమంలో మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతశేఖర్‌గౌడ్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీసీవో పద్మ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo