మంగళవారం 26 మే 2020
Medak - May 23, 2020 , 00:28:17

జనంలోనే ఏడాది..

జనంలోనే ఏడాది..

ప్రజా సమస్యల పరిష్కారానికే  ప్రాధాన్యం 

సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు బాటలో..

కేంద్ర మంత్రులను ఒప్పించి నిధుల సేకరణ   

రైల్వే లైన్లు, రోడ్ల అభివృద్ధికి నిధులు

‘నమస్తేతెలంగాణతో’ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి    

ఎంపీగా బాధ్యతలు చేపట్టి యేడాది  రోడ్డు ప్రమాదాలపై ప్రధాన దృష్టి..

ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించి, వాటి పరిష్కారంపై  దృష్టి సారించా. ఏడాది కాలంలో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌ స్పాట్లపై వీడియోలు, ఫొటోలతో కూడిన నివేదికలను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రికి అందించా. ప్రమాదాల నివారణకు సహకరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశా. దీనితో సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేశారు. అలాగే హైదరాబాద్‌ నుంచి బాలానగర్‌ మీదుగా మెదక్‌ వరకు రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం కింద పార్లమెంట్‌ పరిధిలో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు నిర్మిం చాం. రాజీవ్‌ రహదారిపై బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాం.

మనోహరాబాద్‌ లైన్‌ ఆధునీకరణకు..

మనోహరాబాద్‌ నుంచి అక్కన్నపేట వరకు రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కృషి చేస్తున్నా. ఈ విషయమై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ను పలు మార్లు కలిశా. పటాన్‌చెరు, తెల్లాపూర్‌ వద్ద మరొక ఆర్వోబీ నిర్మించాలని పటాన్‌చెరు ఎమ్మెల్యేతో కలిసి వెళ్లి కేంద్ర మంత్రిని కలువగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పటాన్‌చెరు సమీపంలోని రైల్వే మిగులు భూమిని డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి, అలాగే మార్కెట్‌ యార్డుల నిర్మాణానికి అప్పగించాలని కోరగా, ఆయన అనుకూలంగా స్పందించారు.కేంద్ర మంత్రులను సంప్రదిస్తూ పార్లమెంట్‌ పరిధిలో రైల్వే పనులు వేగంగా పూర్తి చేయించడానికి కృషిచేస్తున్న. లింగంపల్లి నుంచి పటాన్‌చెరు వరకు ఎంఎంటీఎస్‌ లైన్‌ విస్తరించడంలో నా వంతు కృషి ఉన్నది. మనోహరాబాద్‌-కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా లైన్‌ గజ్వేల్‌ వరకు పూర్తి చేయించి ట్రయల్‌ రన్‌ చేయించడంలో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశా. గజ్వేల్‌కు రైలు రానుండడంతో సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌ ప్రజల చిరకాల కోరిక నెరవేరనున్నది. మనోహరాబాద్‌-కొత్తపల్లిలైన్‌కు రూ.235 కోట్లు, అక్కన్నపేట-మెదక్‌ లైన్‌కు రూ.54 కోట్లు, రోడ్ల ఆధునీకరణకు రూ.122 కోట్లు మంజూరు చేయించా.

పరిశ్రమల నుంచి కార్పస్‌ ఫండ్‌ రాబట్టాం..

పటాన్‌చెరు ప్రాంతంలోని పరిశ్రమల నుంచి కార్పస్‌ ఫండ్‌ రాబట్టడానికి కృషి చేశా. పలు పరిశ్రమలు ఏళ్లుగా కార్పస్‌ ఫండ్‌ చెల్లించకుండా బకాయి పడ్డాయి. మంత్రి హరీశ్‌రావుతో చర్చించి, పరిశ్రమల యాజమాన్యాలతో పలుమార్లు చర్చలు జరి పాం. కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యుడిగా పట్టుబట్టి పరిశ్రమల నుంచి ఫండ్‌ వసూలు చేయించా. అలా వసూలు అయిన దాదాపు రూ.200 కోట్లను పరిశ్రమల సమీప గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా చొరవ చూపా.సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైజ్‌పార్క్‌ ఏర్పాటులో కృషి చేశా.పటాన్‌చెరు సమీపంలోని ఈఎస్‌ఐ దవాఖానను ఆధునీకరించాలని పలుమార్లు కేంద్ర మంత్రికి విన్నవించా. లోక్‌సభ సమావేశాల్లో సమస్యలు పరిష్కరించాలని 80 వరకు ప్రశ్నలను  లేవనెత్తా.

ఎన్నికల విజయాల్లో ...

ఉమ్మడి జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్‌ బలపరచిన అభ్యర్థులను గెలిపించడంలో కృషి చేశా. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రా వు సలహాలు, సూచనలు తీసుకుని రోజువారీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న. మంత్రి హరీశ్‌ రావుతో కలిసి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేశాం. ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ అన్నింట్లో కారు జోరు సాగింది. ఎన్నిక ఏవైనా, టీఆర్‌ఎస్‌దే విజయం అన్నట్టు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ఫలితాలొచ్చాయి. ఇలా ఫలితాలు రావడంతో నా వంతు కృషి ఉన్నందుకు సంతోషంగా ఉన్నది.

గోదావరి జలాలతో పులకరించిపోయా..

నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌ పార్లమెంట్‌ పరిధికి గోదావరి జలాలు తరలిరావడం శుభపరిణామం. సీఎం కేసీఆర్‌ను ప్రజలు దేవుడిగా కొలుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అన్నప్పుడు విమర్శించిన వారు, గోదావరి జలాలు సిద్దిపేటకు తరలిరావడం చూసి అభినందిస్తున్నారు. మంత్రు లు కేటీఆర్‌, హరీశ్‌రావు రంగనాయక్‌సాగర్‌ను ప్రా రంభించారు. ఆ రోజు మోటార్ల నుంచి వచ్చిన నీళ్లు మీద పడగానే పులకరించిపోయా. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కాలువల్లో సంతోషంగా ఈత కొట్టిన. ఎలాంటి సాగునీటి వనరులు లేని ప్రాంతానికి గోదావరి జలాలను తరలించి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు స హకారంతో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ప్ర జా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటా. రానున్న నాలుగేండ్లు మరింత ఉత్సాహంతో పనిచేస్తా.


logo