ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - May 19, 2020 , 23:32:01

వృద్ధాశ్రమంలో వసతులపై ఆరా..

వృద్ధాశ్రమంలో వసతులపై ఆరా..

మెదక్‌ : వృద్ధులకు సమస్యలు ఉంటే మండల న్యాయ సేవాధికారి సహాయం చేస్తామని మెదక్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి సుహాసిని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో మీకు భోజనాలు, ఇతర విషయాల్లో మంచిగా చూసుకుంటున్నారా అని సీనియర్‌ సివిల్‌ జడ్జి సుహాసిని వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు అరటి, మామిడి పండ్లు, బిస్కెట్లు అందజేశారు. వృద్ధాశ్రమంలో మొత్తం 14 మంది వృద్ధులు ఉన్నారని తెలిపారు. మీకు సంబంధించిన వారు ఎవరైనా వస్తున్నారా..? మీకు కొడుకులు, బిడ్డలు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట లీగల్‌ సర్వీస్‌ సిబ్బంది ఆంజనేయులు ఉన్నారు.logo