శనివారం 31 అక్టోబర్ 2020
Medak - May 19, 2020 , 23:05:00

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.15,40,000

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.15,40,000

పాపన్నపేట: ఏడుపాయల వనదుర్గాభవానీమాత ఆలయ హుండీ ఆదాయం రూ. 15,40,000 వచ్చినట్లు దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ హేమంత్‌కుమార్‌, ఈవో శ్రీనివాస్‌లు వెల్లడించారు. మంగళవారం గోకుల్‌షెడ్డులో హుండీ ఆదాయం సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో లెక్కించారు. కార్యక్రమంలో  ఎస్సై రంగారావు, సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి తదితరులు పాల్గొనగా, పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.