ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - May 19, 2020 , 22:58:01

నీట మునిగి విద్యార్థి మృతి

నీట మునిగి విద్యార్థి మృతి

చిన్నశంకరంపేట : ఈత కోసం వెళ్లి నీట మునిగి ఊపిరాడక ఓ ఇంటర్‌ విద్యార్థి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మడూర్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... చేగుంట మండలం మక్కరాజ్‌పేట గ్రామానికి చెందిన గడ్డమీది బాల్‌రాజ్‌ రామలక్ష్మి దంపతుల కుమారుడు భానుప్రసాద్‌(17) నాలుగు రోజుల క్రితం అమ్మమ్మ స్వగ్రామమైన మడూర్‌కి వచ్చాడు. మంగళవారం సాయంత్రం తన మిత్రులతో కలసి గ్రామ శివారులోని గుళ్ల చెరువులోకి ఈత  కోసం వెళ్లాడు. చెరువులోకి దిగిన భానుప్రసాద్‌ నీట మునిగి ఊపిరాదక మృతి చెందగా, చెరువులో ఉన్న మరికొందరు విషయాన్ని గమనించి గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని బయటకు తీశారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్సై మహ్మద్‌గౌస్‌ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. 


logo