శుక్రవారం 23 అక్టోబర్ 2020
Medak - May 19, 2020 , 22:52:56

పంట మార్పిడి విధానం అమలు చేయాలి: కలెక్టర్‌ ధర్మారెడ్డి

పంట మార్పిడి విధానం అమలు చేయాలి: కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌, నమస్తే తెలంగాణ : రైతులకు లాభం చేకూరేలా పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్‌, అనుబంధ శాఖల అధికారులు, రైస్‌మిల్లర్స్‌ ప్రతినిధులు, సీడ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు మెదక్‌ జిల్లాలో వరి పంటను నియంత్రిత పద్ధతిలో సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే మొక్కజొన్న పంటను కమర్షియల్‌ పద్ధతిలో సాగు చేయకూడదని, కంది పంటను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాల న్నారు.  ఉద్యాన పంటల సాగుకు ప్రణాళిక రూపొం దించాలని ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్యకు సూచిం చారు.  మార్కెట్‌లో నకిలీ విత్తనాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మెదక్‌ జిల్లాలో ఏ పంటల ఎంత వేయాలి..? అనే అంశాలపై అధికారులు ఖరారు చేయనున్నారని కలెక్టర్‌ వివరిం చారు. ఏఈవోలు ఇంటింటికీ వెళ్లి ఏ పంట వేయాలో రైతులకు అవగాహన కల్పించాలని సూచిం చారు. సమా వేశంలో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తొడుపు నూరి చంద్రపాల్‌, డీఎస్‌వో శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారి రమ్య తదితరులు పాల్గొన్నారు. 


logo