గురువారం 22 అక్టోబర్ 2020
Medak - May 14, 2020 , 22:37:50

కార్మికులకు దాతల ఆసరా

కార్మికులకు దాతల ఆసరా

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాతలు  పలుచోట్ల అన్నదానాలు  చేశారు. దళితుల బతుకుల కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు దళితులు జీవితకాలం రుణపడి ఉంటారని జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షుడు కర్రె రమేశ్‌ అన్నారు. రామాయంపేటలో  పిడమర్తి రవి పుట్టినరోజు సందర్భంగా జాతీయ రహదారిపై వలస కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వలస కార్మికులు కోసం తూప్రాన్‌ పట్టణ బైపాస్‌ రోడ్డులో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన భోజన వసతులను గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, తహసీల్దార్‌ శ్రీదేవి పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి వివిధ రాష్ర్టాలకు కాలినడకన వెళ్తున్న బాటసారులు, వలసదారులకు రామాయంపేట సంకల్ప్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అల్పాహారం  వాటర్‌ బాటిళ్లు, పండ్లు అందజేశారు. హుస్నాబాద్‌లో నిరుపేదలు, చిరు వ్యాపారుల కోసం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, కౌన్సిలర్లు భోజనం వడ్డించారు.logo