మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - May 13, 2020 , 00:18:57

అకాల వర్షంతో నష్టం..

అకాల వర్షంతో నష్టం..

పుల్కల్‌/నారాయణరావుపేట: పిడుగుపడి మృతి చెందిన వారికి విపత్తు నిధుల నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని జడ్పీ చైర్‌పర్సన్‌ పి.మంజుశ్రీజైపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పుల్కల్‌ మండలం చక్రియాలలో పిడుగుపడి మృతి చెందిన మల్లయ్య కుటుంబాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి 25 కిలోల బియ్యం, రూ.5 వేలు, నిత్యావసర సరుకులు అందజేశారు.  నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన పాతూరి కనకయ్య ఇటీవల మృతి చెందాడు. విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో రూ.5 వేలు అందించారు. సాయాన్ని సర్పంచ్‌ మంజులాశ్రీనివాస్‌, నాయకులు కనకయ్య కుటుంబీకులకు అందజేశారు. 

కూలిన ఇంటి పరిశీలన

ఝరాసంగం: మండల పరిధిలోని కొల్లూర్‌, బొప్పన్‌పల్లి, కక్కర్‌వాడ గ్రామాల్లో సోమవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షానికి కొల్లూర్‌కు చెందిన తాలారి రామయ్య ఇల్లు కూలింది. విషయం తెలుసుకున్న వీఆర్వో బిచ్చయ్య, కార్యదర్శి రాజ్‌కుమార్‌ మంగళవారం గ్రామానికి వెళ్లి కూలిన ఇంటిని పరిశీలించారు. నివేదికను పై అధికారులకు అందజేస్తామన్నారు.

తడిసిన ధాన్యం 

సిద్దిపేట రూరల్‌/ నారాయణరావుపేట: సిద్దిపేట రూరల్‌ మండలం రావురూకుల, నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది, జక్కాపూర్‌, మల్యాల, గోపులాపూర్‌ గ్రామాల్లో మంగళవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలి వానకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. 


logo