మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - May 13, 2020 , 00:19:00

మొక్కలను సిద్ధంగా ఉంచాలి

మొక్కలను సిద్ధంగా ఉంచాలి

హత్నూర/ఝరాసంగం/గుమ్మడిదల/అక్కన్నపేట: హరితహారంలో నాటడానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని సంగారెడ్డి జడ్పీ సీఈవో రవి సూచించారు. మంగళవారం హత్నూర మండలం మల్కాపూర్‌, నస్తిపూర్‌ గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. ఝరాసంగం మండలం కొల్లూర్‌లో నర్సరీని పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్‌  పరిశీలించారు. గుమ్మడిదల మండలం దోమడుగులో ఏర్పాటు చేసిన నర్సరీని ఎంపీడీవో చంద్రశేఖర్‌ పరిశీలించారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామని ఎంపీడీవో అన్నారు. హుస్నాబాద్‌ మండలం తోటపల్లిలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వనసేవకులకు  మొక్కలు నాటే విధానంపై అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా, అక్కన్నపేట మండలంలోని అంతకపేటలో పంచాయతీ కార్యదర్శులు, వన సేవకులకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంపై జడ్పీ వైస్‌చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, గొల్లకుంటకు చెందిన నాగభూషణం ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరుగగా, బాధిత కుటుంబాన్ని ఆయన ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ భూక్యమంగతో కలిసి పరామర్శించారు.


logo