గురువారం 29 అక్టోబర్ 2020
Medak - May 12, 2020 , 00:22:58

క్వారంటైన్లపై నిఘా

క్వారంటైన్లపై నిఘా

చేర్యాల/నిజాంపేట/ న్యాల్‌కల్‌/ నంగునూరు/ అక్కన్నపేట: ఇతర రాష్ర్టాల నుంచి చేర్యాలకు వచ్చిన 13 మందికి వైద్యశాఖ అధికారులు, సిబ్బంది సోమవారం పరీక్షలు నిర్వహించారు. ముంబై నుంచి  మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం చల్మెడకు తిరిగివచ్చిన 21 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు సీఐ నాగార్జునగౌడ్‌ తెలిపారు. వారికి కరోనా లక్షణాలు లేనప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. వివిధ రాష్ర్టాల నుంచి న్యాల్‌కల్‌ మండలంలోని స్వగ్రామాలకు చేరుకొని క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అధికారుల బృందం పరిశీలించింది. నంగునూరు మండలం వెంకటాపూర్‌కి చెందిన వ్యక్తి ఇతర రాష్ట్రం నుంచి రావడంతో అధికారులు అతడి ఇంటికి వెళ్లి క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

127 మంది కార్మికులకు స్క్రీనింగ్‌ టెస్టులు 

అక్కన్నపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా రేగొండ పంప్‌హౌస్‌ వద్ద పని చేస్తున్న వివిధ రాష్ర్టాలకు చెందిన 127 మంది వలస కార్మికులకు సోమవారం స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించినట్లు తాసిల్దార్‌ వేణుగోపాల్‌రావు తెలిపారు. మండల వైద్యాధికారి, మురళి కృష్ణ ఆధ్వర్యంలో ఈ స్క్రీనింగ్‌ టెస్టులు పూర్తి చేశారు. 


logo