శనివారం 31 అక్టోబర్ 2020
Medak - May 12, 2020 , 00:23:02

నిత్యావసర సరుకులు పంపిణీ

నిత్యావసర సరుకులు పంపిణీ

  • మెదక్‌ రూరల్‌: పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, మండల శాఖ అధ్యక్షుడు సతీశ్‌రావు ఆధ్వర్యంలో వలస కుటుంబాలకు  సరుకులు అందజేశారు.  
  • రామచంద్రాపురం: ఈఎస్‌ఐ దవాఖాన వద్ద ఉన్న చర్చిలో మెదక్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గాలిఅనిల్‌కుమార్‌, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమకుమార్‌, కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌ పేదలకు సరుకులు అందజేశారు.
  • జిన్నారం:  కాంగ్రెస్‌ మెదక్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్‌ సహకారంతో ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌  శ్రీకాంత్‌రెడ్డి సోలక్‌పల్లి, రాళ్లకత్వ, అండూరు గ్రామాల పారిశుధ్య కార్మికులకు సరుకులు అందజేశారు. 
  • మిరుదొడ్డి: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ యువత విభాగం రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి జర్నలిస్టులకు సరుకులను పంపిణీ చేశారు. 
  • మెదక్‌:  మా గ్రోస్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెదక్‌ పట్టణ సీఐ వెంకట్‌ పేదలకు సన్నబియ్యం పంపిణీ చేశారు.  
  • సిద్దిపేట కలెక్టరేట్‌: కౌన్సిలర్‌ సాకి బాల్‌లక్ష్మి 6వ వార్డులో, పట్టణంలో కేధారినాథ్‌ అన్నదాన సేవా సమితి సహకారంతో పేదలకు సరుకులు పంపిణీ చేశారు.  
  • గజ్వేల్‌ అర్బన్‌: 19 వార్డులో దాతలు వనం మురళి,  కట్‌మిట్‌ మురళి, అత్తెల్లి శ్రీను సహకారంతో కౌన్సిలర్‌ గుంటుకు రాజు  పేదలకు సరుకులు అందజేశారు. 
  • బెజ్జంకి: ఉపాధ్యాయుడు చెలుకల తిరుపతిరెడ్డి కల్లెపల్లి  పంచాయతీ, వాటర్‌ప్లాంట్‌ సిబ్బందిని సన్మానించి, సరుకులు అందజేశారు. 

రేషన్‌ బియ్యం పేదలకే..

రామాయంపేట: లాక్‌డౌన్‌ కారణం గా రేషన్‌ కార్డులేని కుటుంబాలకు సోమవారం రామాయంపేట మండలం కోనాపూర్‌కి చెందిన రాజుగౌడ్‌ 48 కిలోల బియ్యాన్ని పేదల ఆకలి తీర్చడం కోసం డీలర్‌ బ్రహ్మానందరెడ్డి ఏర్పాటు చేసిన డ్రమ్ములో పోశారు. రాజుగౌడ్‌ను గ్రామస్తులు ఆదర్శంగా తీసుకుని పేదల ఆకలి తీర్చడానికి ముందుకు రావాలని ఎంపీపీ భిక్షపతి, సర్పంచ్‌ చంద్రకళ కోరారు.