బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - May 10, 2020 , 00:54:56

ఆకలి తీరుస్తున్నారు..

ఆకలి తీరుస్తున్నారు..

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా దాతల సహకారంతో పలుచోట్ల అన్నదానాలు చేశారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లలితాసోమిరెడ్డి వలస కూలీలకు, పేదలకు అన్నదానం చేశారు. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని శనివారం సింగిల్‌విండో డైరెక్టర్‌ మ్యాక నారాయణ, కౌన్సిలర్‌ పెరుక భాగ్యరెడ్డి ప్రారంభించారు. నర్సాపూర్‌లో వలస కార్మికులకు యువసేనా ఆధ్వర్యంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ అన్నదానం చేశారు. రామాయంపేటలో జాతీయ రహదారి వద్ద బాటసారులకు మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, సీఐ నాగార్జునగౌడ్‌ అన్నం వడ్డించారు. తూప్రాన్‌ శివారులోని అల్లాపూర్‌ టోల్‌ప్లాజా వద్ద వలస కార్మికులు, కూలీలకు జీఎమ్మార్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌, రక్షా సెక్యూర్టీ సర్వీసెస్‌ ఇన్‌చార్జి రాజశేఖర్‌ ఆధ్వర్యంలో, బైపాస్‌ రోడ్డులో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో వలస కార్మికులకు అన్నదానం చేశారు.logo