ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - May 07, 2020 , 00:33:58

పుట్టిన పాపను అమ్ముకున్న తల్లిదండ్రులు

పుట్టిన పాపను అమ్ముకున్న తల్లిదండ్రులు

చిలిపిచెడ్‌ : ఆడబిడ్డ పుట్టిన మరుసటి రోజే అమ్ముకున్న సంఘటన చిలిపిచెడ్‌ మండలం చిట్కుల్‌ బద్రియ తండాల్లో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్రియ తండాకు చెందిన లంగోత్‌ దుర్గ్యా, సంగీతలకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆదివారం సంగీతను కుటుంబీకులు మెదక్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, మళ్లీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దవాఖాన నుంచి ఇంటికి వచ్చిన వారిని స్థానికులు ఆరా తీయగా శిశువును రూ.5 వేలకు అమ్ముకున్నారని, ఓ ఆశావర్కర్‌ సహాయపడినట్లు అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ మల్లారెడ్డి గురువారం వరకు తల్లితో పాటు శిశువు ఉండకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


logo