శనివారం 31 అక్టోబర్ 2020
Medak - May 05, 2020 , 23:42:46

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్రం కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని ఎఫ్‌డీసీ చైర్మన్‌  వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో 30 కి పైగా పీఎసీఎస్‌, ఐకేపీ కొనుగోలు కేంద్రా లు ఉన్నాయని వీటి ద్వారా 88,448.52 క్వింటాళ్ల వడ్లు,  గజ్వేల్‌ పరిధిలో 3990 క్వింటాళ్ల మొక్కజొన్నలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాయపోల్‌ మండలంలోని మంతూర్‌, అనాజీపూర్‌, తిమ్మక్కపల్లి గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను డీఆర్‌డీవో పీడీ గోపాల్‌రావు  పరిశీలించారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ నాగిరెడ్డి , రైతు బంధు సమితి రాష్ట్ర డైరెక్టర్‌  రవీందర్‌తో కలిసి సందర్శించారు. కొమురవెల్లి  మండలంలోని రసూలాబాద్‌లోని ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని  ఎంపీడీవో  పరిశీలించారు. నారాయణఖేడ్‌ డివిజన్‌ పరిధిలో  24 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 4375 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.  కల్హేర్‌, కంగ్టి , తడ్కల్‌లోని  మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో 200 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. అల్లాదుర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  కొనుగోలు కేంద్రంలోని తూకాన్ని తూనికలు, కొలుతల జిల్లా అధికారి భూలక్ష్మి  పరిశీలించారు. రామాయంపేట మండలంలోని దామరచెర్వు, అక్కన్నపేటలోని  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎఫ్‌సీఐ  డైరెక్టర్‌ స్వరాజ్‌ తనిఖీ చేశారు. నర్సాపూర్‌ మండల పరిధిలోని ఖాజీపేట్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య పరిశీలించారు. తూప్రాన్‌ మండలం యావాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని నర్సాపూర్‌ డివిజన్‌ ఆత్మకమిటీ వైస్‌ చైర్మన్‌ బాబుల్‌రెడ్డి,పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టుబాలకృష్ణారెడ్డి పరిశీలించారు.