బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - May 05, 2020 , 23:42:50

ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి

ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌ : గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పిస్తూ కూలీల సంఖ్య ఎక్కువగా పెంచాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ సూచిం చారు. చిన్నకోడూరు మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జడ్పీ సీఈవో శ్రావణ్‌తో కలిసి ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పనికోసం వచ్చేవారంద రికీ తప్పకుండా ఉపాధిహామీలో పని కల్పించాలన్నారు.   దుబ్బాక మండలంలోని పోతారెడ్డిపేటలో ఉపాధి హామీ పనుల్లో కూలీలు పాల్గొన్నారు. గుమ్మడిదల మండలంలోని అనంతారం, వీరన్నగూడెం, నాగిరెడ్డిగూడెం, నల్లవల్లి, కొత్తపల్లి, గుమ్మడిదల గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫార్మేషన్‌ రోడ్డును వేస్తున్నారని ఎంపీడీవో చంద్రశేఖర్‌ తెలిపారు. అక్కన్నపేటలోని కట్కూర్‌, చాపగానితండా, చౌటపల్లి, గొల్లపల్లి గ్రామాల్లోని నర్సరీ కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను జడ్పీ సీఈవో శ్రావణ్‌కుమార్‌ పరిశీలించారు. ఏప్రిల్‌ నుంచి కూలీలకు వేసవి భత్యం సైతం అదనంగా ఇస్తున్నట్లు చెప్పారు. కోహెడ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పీఏసీఎస్‌ చైర్మన్‌ పేర్యాల దేవేందర్‌రావు, సర్పంచ్‌ నవ్య పరిశీలించి కూలీలకు మాస్క్‌లను పంపిణీ చేశారు. బెజ్జంకిలోని గుగ్గిళ్ల గ్రామంలో ఉపాధిహామీ పనులను ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత పరిశీలించి, కరోన వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తోటపల్లిలో ఎంపీడీవో ఓబులేశ్‌ ఉపాధిహామీ పనులను పరిశీలించారు. కొమురవెల్లిలోని రసూలాబాద్‌లో ఎంపీడీవో మల్లికార్జున్‌తో కలిసి ఉపాధిహామీ పనులను పరిశీలించారు. తూప్రాన్‌లోని ఇస్లాంపూర్‌, గుండ్రెడ్డిపల్లి, దాతర్‌పల్లి, యావాపూర్‌ గ్రామాల్లో ఉపాధిహామీ  పనుల్లో పాల్గొంటున్న కూలీలకు అధికారులు మాస్క్‌లతో పాటు అంబలిని అందజేశారు. జహీరాబాద్‌లోని రాయిపల్లి(డి) గ్రామంలో ఎంపీడీవో రాము లు పనులు పరిశీలించారు. గ్రామంలో 460 మంది పనులు చేస్తున్నారని, ప్రతి కూలీకి పనులు కల్పించేందుకు పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలన్నారు. గజ్వేల్‌ ఎంపీపీ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ సిబ్బందితో ఉపాధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవోలు గజ్వేల్‌ మండలంలోని 25 గ్రామాల్లో  జరుగుతున్న ఉపాధి హామీ పనుల గురించి తెలుసుకున్నారు. రైతు కూలీలు, జాబ్‌కార్డులున్న వారు చాలా మంది ఉన్నారని, వారందరికీ కూడా పని కల్పించాలని ఎంపీపీ, జడ్పీటీసీ సూచించారు. గ్రామాల్లో ఇంకా కొత్తగా పనులను గుర్తించాలని సూచించారు. 


logo