ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - May 01, 2020 , 00:46:44

అమ్మలా ఆకలి తీరుస్తున్నారు...

అమ్మలా ఆకలి తీరుస్తున్నారు...

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల దాతలు అన్నార్తులకు భోజనం పెడుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నదానాలు చేస్తున్నారు. గురువారం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్‌లో మున్సిపర్‌ చైర్‌పర్సన్‌ లలితాసోమిరెడ్డి, భెల్‌ బీఎంఎస్‌ యూనియన్‌ నాయకుడు రాజ్‌కుమార్‌ బొంబాయికాలనీలో, బండ్లగూడలో మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు కృష్ణయాదవ్‌ అన్నదానాలు చేశారు. హుస్నాబాద్‌ పట్టణంలో పారిశుధ్య కార్మికులకు స్థానిక జామామసీద్‌ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు అన్నదానం ఏర్పాటు చేయగా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత ప్రారంభించారు. రామాయంపేట సంకల్ప్‌ ఫౌండేషన్‌ యువసేన సభ్యులు జాతీయ రహదారి అడిగాస్‌ వద్ద, మండల పరిధిలోని లక్ష్మాపూర్‌, కాట్రియాల గ్రామాల యువకులు, విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వాహకులు అన్నదానం చేశారు. మర్కూక్‌ మండల పరిధిలోని ఎర్రవల్లిలో టీటీడీ సభ్యులు మొరంశెట్టి రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి ప్రారంభించారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పారిశుధ్య కార్మికులకు డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ కుంట్ల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయగా, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నకోడూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గంప వెంకటరాజం జ్ఞాపకార్థం కుమారులు శ్రీనివాస్‌, కృష్ణమూర్తి సహకారంతో పంపిణీ చేస్తున్న ఆహార ప్యాకెట్లను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాముని శ్రీనివాస్‌ కూలీలకు, రైతులకు అందజేశారు. ఆకలి ఫౌండేషన్‌ కన్వీనర్‌ రాజశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో దాత బి.ప్రవీణ్‌ సహకారంతో సంగారెడ్డి జిల్లా దవాఖాన ప్రాంగణంలో రోగుల సహాయకులకు, సిబ్బంది అన్నదానం చేశారు. అదేవిధంగా చిన్నశంకరంపేటలో సర్పంచ్‌ రాజిరెడ్డి సౌజన్యంతో తాసిల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో లక్ష్మణమూర్తి పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. సిద్దిపేట పట్టణంలో హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు పొన్నాల శివకుమార్‌ ఆధ్వర్యంలో కార్మికులకు అన్నదానం చేశారు. నర్సాపూర్‌లో కార్మికులకు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ అన్నదానం చేశారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వలస కార్మిక కుటుంబాలకు ఆశిష్‌ ఆశ్రయ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పులిహోర, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.


logo