బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - May 01, 2020 , 00:44:40

మాస్క్‌లను ధరించాలి

మాస్క్‌లను ధరించాలి

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: గజ్వేల్‌ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ గజ్వేల్‌శాఖ తరుఫున మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకియొద్దీన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, వైద్యులు లింగం, నరేశ్‌బాబు, మల్లయ్య, చంద్రారెడ్డి మాస్క్‌లు, శానిటైజర్లను గురువారం పంపిణీ చేయగా, మెదక్‌ మండలం గుట్టకిందిపల్లెలో సర్పంచ్‌ కొనుగోలు కేంద్రంలోని హమాలీలకు మాస్క్‌లను అందజేశారు. కోహెడ మండలం శనిగరంలో ఉపాధిహామీ కూలీలకు ప్రతిమ ఫౌండేషన్‌ సమకూర్చిన మాస్క్‌లను సర్పంచ్‌ కర్ర జయశ్రీ, కార్యదర్శి శోభ పంపిణీ చేశారు. హుస్నాబాద్‌లో ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యం ఆధ్వర్యంలో చేపట్టిన మాస్క్‌ల పంపిణీని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత ప్రారంభించారు. చిలిపిచెడ్‌ మండల పరిధిలోని సోమక్కపేటలో 150 మంది ఉపాధిహామీ కూలీలకు సర్పంచ్‌ స్రవంతి మాస్క్‌లను పంచగా నిజాంపేట మండలంలోని నార్లపూర్‌, చల్మెడ గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలకు నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నిజాంపేట పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కిష్టారెడ్డిలు మాస్క్‌లను అందజేశారు. పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి పాపన్నపేట మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ లింగంపేట బాలాగౌడ్‌ మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. పెద్దశంకరంపేట మండలం జంబికుంట పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎస్‌ఐ.సత్యనారాయణతో పాటు పోలీసులకు  శానిటైజర్లు, మాస్క్‌లను అందజేయగా, తూప్రాన్‌ ఎస్‌ఐ సుభాశ్‌తో పాటు పోలీసు సిబ్బందికి మున్సిపల్‌ రిసోర్స్‌ పర్సన్‌ నీలారెడ్డి, బాలమణి మాస్క్‌లను అందజేశారు. న్యాల్‌కల్‌ మండలంలోని రేజింతల్‌లో ఉపాధిహామీ కూలీలకు సర్పంచ్‌ కుత్బుద్దీన్‌ మాస్క్‌లను పంపిణీ చేశారు. గజ్వేల్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఐఎంఎ డాక్టర్లు పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. కాగా, జిన్నారం మండలంలోని ఊట్లలో ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ గంగు రమేశ్‌ రసాయనాలను పిచికారీ చేశారు. 


logo