శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Apr 27, 2020 , 00:39:57

ఘనంగా బసవేశ్వరుడి జయంతి

ఘనంగా బసవేశ్వరుడి జయంతి

వట్‌పల్లి /పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ /చేర్యాల, నమస్తే తెలంగాణ / గుమ్మడిదల /మిరుదొడ్డి / నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ /ఝరాసంగం/ రాయికోడ్‌ : బసవేశ్వరుడి బోధనలు ఆచరణీయమని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు. బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని పోతులబోగుడలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆవిష్కరించారు. అలాగే, జోగిపేటలో విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే, మండల వ్యాప్తంగా లింగాయత్‌ సమాజ్‌ ఆధ్వర్యం లో బసవేశ్వరుడి  జయంతిని నిర్వహించారు. పటాన్‌చెరులో నిర్వహించిన జయంతిలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుమ్మడిదల మండలంలోని వీరన్నగూడెం వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని బసవేశ్వరుడి విగ్రహం వద్ద వీరశైవలింగాయత్‌ జిల్లా నాయకుడు గిద్దెరాజు, వీరశైవలింగాయత్‌ గ్రామకమిటీ అధ్యక్షుడు గటాటి రమేశ్‌ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి జయంతిని నిర్వహించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో లింగాయత్‌ల ఆధ్వర్యంలో బసవేశ్వరుడి జయంతిని నిర్వహించారు. నర్సాపూర్‌ పట్టణంలోని శివాలయం వద్ద ఉన్న బసవేశ్వర విగ్రహానికి వీరశైవ లింగాయత్‌ ప్రతినిధులు వీరప్పగురూజీ, వినోద్‌, సంగమేశ్వర్‌, బస్వప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఝరాసంగం, బర్దీపూర్‌, కుప్పానగర్‌, కప్పాడ్‌, ఏడాకులపల్లి, రాయికోడ్‌ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బసవేశ్వరుడి జయంతిని జరుపుకున్నారు.