బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Apr 27, 2020 , 00:32:27

కార్మికులు, కూలీలకు అన్నదానం

కార్మికులు, కూలీలకు అన్నదానం

హుస్నాబాద్‌/ సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ/ రామయంపేట: సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో ఆదివారం అన్నదానం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ఆధ్వర్యంలో పేదలు, కూలీలు, వలస కార్మికులకు భోజనాలు వడ్డించారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు పేదలందరికీ కోర్టు ఆవరణలో అన్నదానం చేస్తున్నట్లు ప్రధానన్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి నెలకు సరిపడే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీజే పాపిరెడ్డి, పీపీ నర్సింగరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, హుస్నాబాద్‌లోని వీఎల్‌రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో 1983-84 పదో తర గతి పూర్వవిద్యార్థులు, భార్గవాపురం సేవా సమితి ప్రతినిధులు  మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు అన్నదానం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  రజితా వెంకట్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి తదితరులు కార్మికులకు అన్నం వడ్డించారు. రామాయంపేటలో  లయన్స్‌ క్లబ్‌, స్నేహబంధు సంస్థ ప్రతినిధులు  200 మంది వలసకూలీలకు అన్నదానం చేశారు. అలాగే, పీఆర్టీయూ నాయకులు బాటసారులకు పండ్లు అందజేశారు. మనోహరాబాద్‌ మండలంలోని కాళ్లకల్‌ చెక్‌పోస్టు వద్ద వలస కూలీలకు ఆహార పొట్లాలను టీఆర్‌ఎస్‌ నాయకుడు ర్యాకల శేఖర్‌గౌడ్‌ అందజేశారు.   logo