గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Apr 20, 2020 , 01:16:34

వలస కార్మికులను ఆదుకుంటాం

వలస కార్మికులను ఆదుకుంటాం

  • ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి 

నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ : వలస కార్మికులను ఆదుకుంటామని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్‌ ఆర్టీసీ డిపో మైదానంలో ఆదివారం ఆటోడ్రైవర్లకు అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థ సాయంతో బియ్యం, నిత్యావసర సరుకులను ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వలస కార్మికులకు బియ్యం, డబ్బులను ఇస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. అక్షయ పాత్ర నుంచి నర్సాపూర్‌లో 500 మందికి, చిలిపిచెడ్‌లో 100 మందికి, వెల్దుర్తి మండలం మాసాయిపేటలో 100 మందికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డిలు మాట్లాడుతూ కరోనా వైరస్‌ కట్టడిలో పోలీసులు, గ్రామసేవకుల పాత్ర ఎంతో గొప్పదన్నారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, అక్షయ పాత్ర ప్రతినిధి లోహిత్‌చంద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నహీం, కౌన్సిలర్లు అశోక్‌గౌడ్‌, రామచందర్‌, యాదగిరి, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లేశ్‌గౌడ్‌, శేఖర్‌, హబీబ్‌ఖాన్‌ ఉన్నారు.

మనోహరాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద... 

మనోహరాబాద్‌ : మనోహరాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఒరిస్సా రాష్ర్టానికి చెందిన 16 నిరుపేద కుటుంబాలకు బియ్యం, రూ. 500 నగదును జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ డైరెక్టర్‌ భిక్షపతి, నాయకులు దశరథ, నరేందర్‌గౌడ్‌, ఆంజనేయులు, వీఆర్‌వో హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌ బియ్యం పంపిణీ..

మెదక్‌, నమస్తే తెలంగాణ : మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి మెదక్‌ పట్టణానికి వచ్చిన  వలస కార్మికులకు 25వ వార్డు కౌన్సిలర్‌  కృష్ణారెడ్డి  12 కిలోల రేషన్‌  బియ్యంతో పాటు రూ.500 నగదును అందజేశారు. మెదక్‌ మండలం మంబోజిపలికి మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన 15 మంది కార్మికులకు గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేశారు. 


logo