మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Apr 19, 2020 , 00:52:40

కొనుగోలు కేంద్రం ప్రారంభం

కొనుగోలు కేంద్రం ప్రారంభం

కొల్చారం: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొల్చారం సొసైటీ చైర్మన్‌ మనోహర్‌ అన్నారు. సొసైటీ పరిధిలోని అప్పాజిపల్లిలో శనివారం ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, సర్పంచ్‌ ఝాన్సీలక్ష్మి యాదగిరితో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా సొసైటీ చైర్మన్‌ మనోహర్‌ మాట్లాడుతూ టోకెన్‌ నంబర్‌ ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలన్నారు.

కొనుగోలు కేంద్రాల పరిశీలన.. 

చిన్నశంకరంపేట : మండలంలోని మిర్జాపల్లి, కామారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో లక్ష్మణమూర్తి, ఏవో శ్రీనివాస్‌లు పరిశీలించారు. 

ఈ సందర్భంగా తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు యాదగిరి యాదవ్‌, శ్రీనివాస్‌రెడ్డి, రైతులు  ఉన్నారు.


logo