శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Apr 12, 2020 , 23:50:23

కార్మికులు, కూలీలకు నగదు పంపిణీ

కార్మికులు, కూలీలకు నగదు పంపిణీ

అమీన్‌పూర్‌/చిన్నకోడూరు/ సిద్దిపేట అర్బన్‌/ వెల్దుర్తి: అమీన్‌పూర్‌ మున్సిపల్‌లోని బీరంగూడలో వలస కార్మికులకు ప్రభుత్వం అందజేసిన నగదును ఆదివారం కౌన్సిలర్‌ కవితాశ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు. చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌లో 32 మంది 12 కిలోల బియ్యం, రూ.500 ఆర్థిక సహాయాన్ని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, సర్పంచ్‌ చంద్రకళ రవి, ఎంపీటీసీ దుర్గారెడ్డి ఉన్నారు.  సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో కార్మికులకు నిత్యావసర సరుకులను వార్డు సభ్యురాలు ఆఫీసాబేగం అందజేశారు.  వెల్దుర్తి  మండలంలోని వెల్దుర్తి, చర్లపల్లి చర్లపల్లి గ్రామాల్లో  వలస కూలీలు, పేదలు, పారిశుధ్య కార్మికులకు స్థానిక యువకులు బియ్యం  పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు భాగ్యమ్మఆంజనేయులు, అశోక్‌రెడ్డి, తహసీల్దార్‌ ఆనంద్‌రావు, ఎస్‌ఐ గంగరాజు పాల్గొన్నారు. 


logo