మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Apr 11, 2020 , 02:22:53

19వ రోజూ మూతే..

19వ రోజూ మూతే..

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. 19 రోజైన శుక్రవారం నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లో ప్రశాంతంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. కొమురవెల్లి, మద్దూరు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్‌ పట్టణ సీఐ వెంకట్‌ హెచ్చరించారు. రామాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్‌ టోల్‌ప్లాజా వద్ద జనసంచారం లేకపోవడంతో రోడ్డు నిర్మానుష్యంగా మారింది. అందోల్‌ నియోజకవర్గంలో పోలీసులు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. వట్‌పల్లిలో శుక్రవారం అంగడి కావడంతో రైతులు, వ్యాపారులు రాకుండా పోలీసులు రోడ్లను బ్లాక్‌ చేసి.. స్థానికంగా ఉన్న దుకాణాలు మూసి వేశారు. హుస్నాబాద్‌ పట్టణంతోపాటు డివిజన్‌లోని అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించారు. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు విచారించి పలు వాహనాలను సీజ్‌ చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ మహేందర్‌ లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్‌ ఎదుట ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి సందర్శించి అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనదారుల ను ఆపి వివరాలు తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, పటాన్‌చెరు, రామచంద్రాపురం, బుధేరా చౌరస్తా, అందోల్‌-జోగిపేట, జహీరాబాద్‌ల్లో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఇతర రాష్ర్టాల వాహనాలను నిలిపివేశారు. మెదక్‌ జిల్లాలోని 20 మం డలాల్లో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట మున్సిపాలిటీల్లో కిరాణాషాపుల ఎదుట సర్కిళ్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటతోపాటు నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట రూర ల్‌, సిద్దిపేట అర్బన్‌, నారాయణరావుపేట మండలాల్లో ప్రశాంతంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. సిద్దిపేట పాత బస్టాండ్‌ ఆవరణ, డిగ్రీ కళాశాల మైదానం, మల్టీపర్పస్‌ హైస్కూల్‌ ఆవరణల్లో తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేసి కూరగాయలు విక్రయిస్తున్నారు. 


logo