బుధవారం 03 జూన్ 2020
Medak - Apr 03, 2020 , 01:35:04

నిరాడంబరంగా రాములోరి లగ్గం

 నిరాడంబరంగా రాములోరి లగ్గం

ఉమ్మడి మెదక్‌ నెట్‌వర్క్‌ : శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలుఆలయాల్లో  సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఉత్సవాలకు భక్తులు హాజరయ్యారు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎవరి ఇండ్లలో వారు ఘనంగా శ్రీరామనవమి వేడుకలను జరుపుకున్నారు.  అందోలు నియోజకవర్గం వ్యాప్తంగా  భక్తిశ్రద్ధలతో శ్రీరామ కల్యాణం నిర్వహించారు.  మునిపల్లి  రామమందిరంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ హాజరయ్యారు. సంగారెడ్డి హరిహర క్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేచింతా ప్రభాకర్‌ పాల్గొన్నారు. తొగుట-రాంపూర్‌ మదనానంద శారదా క్షేత్రంలో శ్రీ క్షేత్రం పీఠాధిపతి శ్రీ మధుసూదనానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. తుక్కాపూర్‌ వెంకటేశ్వరాలయం, ఘనపూర్‌ లక్ష్మీ నర్సింహస్వామి దేవాయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించారు. జోగిపేటలోని పబ్బతి హనుమాన్‌, వీరహనుమాన్‌ దేవాలయాల్లో ఘనంగా శ్రీరామకల్యాణం నిర్వహించారు. హత్నూర,వట్‌పల్లి , రాయికోడ్‌, పుల్కల్‌ మండలాల్లో  శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.  కౌడిపల్లి  అభయసీతారామాంజనేయ స్వామి ఆలయంలో, మెదక్‌ మండలం పేరూర్‌ సరస్వతీ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. పెద్దశంకరంపేట  రామాలయంలో, నిజాంపేట, మిరుదొడ్డిలలో పరిమిత భక్తులతో నవమి వేడుకలు జరిపారు.  నర్సాపూర్‌  శ్రీరామాలయం, సీతారాంపూర్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మద్దూరు రామాలయంలో, ధూళ్మిట్ట రామాలయం, బెక్కల్‌ రామలింగేశ్వరస్వామి ఆలయం,  సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి.   గుమ్మడిదల కల్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో  రాములోరి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. దేశంలోనే రెండో  దేవాలయంగా పేరుగాంచిన ఈ దేవాలయంలో హనుమంతుడు లేని పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు తన కుటుంబ సభ్యులతో భక్తులకు దర్శనమిస్తారు. జిన్నారంలోని రామాలయం, మంగంపేటలోని సీతారామచంద్రస్వామి ఆలయాలలో సీతారాముల కల్యాణోత్సవం నిరాడంబరంగా జరిగింది. ఆర్సీపురం డివిజన్‌ శ్రీనివాస్‌నగర్‌కాలనీ హనుమాన్‌ ఆలయంలో,   నారాయణఖేడ్‌తో పాటు డివిజన్‌ పరిధిలోని మండలాల్లో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించారు. గజ్వేల్‌లోని పలు ఆలయాల్లో  శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. మండలపరిధిలోని మిట్టపల్లిలో, రంగధాంపల్లిలోని హనుమాన్‌ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. మెదక్‌ డివిజన్‌ పరిధిలోని జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో గురువారం సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. మెదక్‌లోని కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా జరిపారు.సీతారాముల కల్యాణోత్సవాన్ని భక్తులు టీవీల్లోనే వీక్షించారు.  చిన్నశంకరంపేట, టేక్మాల్‌, అల్లాదుర్గం, పాపన్నపేట  మండలాల్లో  వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేటలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. పారుపల్లి వీధిలో గల 800 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన రామాలయంలో సీతారామచంద్రస్వామి కల్యాణం కమణీయంగా జరిగింది. రామాయంపేటతో పాటు మండలంలోని కోనాపూర్‌,రాయిలాపూర్‌, అక్కన్నపేట తదితర గ్రామాలలోని రామాలయాలలో సీతారాముల కల్యాణాలు ఘనంగా జరిగాయి.  కొండపాక  మండలం  మర్పడగ హనుమాన్‌ దేవాలయంలో నిర్వహించిన  సీతారాముల  కల్యాణోత్సవంలో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి,  సర్పంచ్‌ చిట్టి మాధురి పాల్గొన్నారు. తూప్రాన్‌, మనోహరాబాద్‌, వెల్దుర్తి, రామాయంపేట, నిజాంపేట, చేగుంట మండలాల్లో శ్రీ రామ నవమి వేడుకలను ఘనంగానిర్వహించారు.  నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో   శ్రీ సీతారామ కల్యాణాన్ని ఆలయ పూజారులు నిరాడంబరంగా నిర్వహించారు.  


logo