సోమవారం 25 మే 2020
Medak - Mar 31, 2020 , 23:16:22

మేమున్నామని..

మేమున్నామని..

ఉమ్మడి మెదక్‌ జిల్లా బృందం: స్థానిక ప్రాంతీయ విబేధాలు లేకుండా కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందామని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం గజ్వేల్‌ పరిధిలోని ముట్రాజ్‌పల్లి వద్ద నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణ కూలీలకు ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం, రూ.500ల నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సా రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల నుంచి 10వేల మంది కూలీలు అభివృద్ధి పనులను చేస్తున్నారు. ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం, రూ.500ల రూపాయల నగదు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాట్లు చేశారన్నారు. కరోనాకు సంబంధించిన లక్షణాలతో వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలన్నారు.  సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేటలోని మందపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డీఎక్స్‌ఎన్‌ పరిశ్రమ వద్ద ఉన్న క్యాంపులో 360 మంది వలస కూలీలకు, నర్సపురం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల వద్ద పనిచేస్తున్న 320 మందికి,  మర్కూక్‌ క్యాంపులోని 300 మందికి, తున్కిబొల్లారం క్యాంపులోని 600 మందికి మంత్రి హరీశ్‌రావు బియ్యంతో పాటు నగదు అందజేశారు. బెజ్జంకి మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో 30 మంది వలస కుటుంబాలకు బియ్యం, రూ.500లను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పంపిణీ చేశారు. హుస్నాబాద్‌ మండలం పట్టణ శివారులోని కూలీలకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, తహసీల్దార్‌ అబ్దుల్‌ రహమాన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 135 వలస కూలీల కుటుంబాల్లో 381మంది ఉండగా కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 500ల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోహెడ మండలం కూరెల్ల గ్రామంలో వలస కూలీలు 35 కుటుంబాలకు, తంగళ్లపల్లిలోని 64 కుటుంబాలకు తహసీల్దార్‌ బి.రుక్మిణీ రూ.500, అలాగే ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం పంపిణీ చేశారు. మద్దూరు మండల కేంద్రంలోని వలస కూలీలకు  హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డితో కలిసి ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి బియ్యాన్ని పంపిణీ చేశారు. మెదక్‌ జిల్లాలో 2500మంది వలస కూలీలను గుర్తించగా మంగళవారం 600మందికి ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం, రూ.500నగదును మండల తహసీల్దార్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వలస కూలీలకు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశారు. తూప్రాన్‌ డివిజన్‌లో 327 మంది వలస కూలీలకు బియ్యం, నగదును పంపిణీ చేయగా శివ్వంపేట మండలంలో165మంది వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. మెదక్‌ మండలం మంబోజిపల్లి గ్రామంలో 45 మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం, రూ.500 నగదును మెదక్‌ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌యాదవ్‌, గ్రామ సర్పంచ్‌ ప్రభాకర్‌లు పంపిణీ చేశారు. రామాయంపేటలో మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, సీఐ నాగార్జునగౌడ్‌ పంపిణీ చేశారు. చేగుంటలో తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, సర్పంచ్‌ శ్రీనివాస్‌లు, నడింతండాలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌, సర్పంచ్‌ స్వాతిశ్రీనివాస్‌, ఎంపీటీసీ వలియనాయక్‌లు నగదు, బియ్యాన్ని పంపిణీ చేశారు. రాంపూర్‌లో సర్పంచ్‌ భాస్కర్‌ 12 మంది నాందేడ్‌ వాసులకు 155 కిలోల బియ్యాన్ని, రూ. 6500ల నగదును అందజేశారు. నిజాంపేటలో తహసీల్దార్‌ జయరాములు, జెడ్పీటీసీ విజయ్‌కుమార్‌, ఎంపీటీసీ లహరీలు, సర్పంచ్‌ అనూష కూలీలకు 12 కిలోల బియ్యం, రూ. 500 ల నగదును అందజేశారు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో వలస కూలీలకు తహసీల్దార్‌ ఆనందరావు, సర్పంచ్‌ భాగ్యమలు అందజేశారు. శివ్వంపేట మండలంలోని శభాష్‌పల్లి, దొంతి, నవాబ్‌పేట, తిమ్మాపూర్‌ గ్రామాల్లో తహసీల్దార్‌ భానుప్రకాశ్‌, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, సర్పంచ్‌ పార్వతీసత్యంలు బియ్యం, రూ. 500 నగదును ప్రజలకు అందజేశారు. మెదక్‌ మండలం మంభోజిపల్లిలో 25 మందికి రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేశారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులోని స్టీల్‌ పరిశ్రమ కార్మికులకు 12 కిలోల బియ్యాన్ని తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో లక్ష్మణమూర్తిలు అందజేశారు. రేగోడ్‌ మండలంలో తహసీల్దార్‌ సత్యనారాయణ 22 మంది వలస కూలీలకు బియ్యం, నగదును అందజేశారు. చిలిపిచెడ్‌ మండలంలో గ్రామ సర్పంచ్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షిషాలు జోగిపేటలో  పారిశుధ్య పనుల్లో భాగంగా చేపడుతున్న సోడియం హైపోక్లోరైడ్‌ స్ప్రే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అదే విధంగా నారాయణఖేడ్‌ నియోజకవర్గం పరిధిలోని కల్హేర్‌లో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఆర్డీవో అంబదాస్‌ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో వలస కూలీలకు బియ్యం, నగదును అందజేశారు.  కొండపాక మండలం సింగారం శివారులో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో కూలీ పనులు చేస్తున్న వారికి ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి బియ్యం, నగదును  అందజేశారు. జిల్లాలో 22,231 మంది వలస కార్మికులను గుర్తించగా.. మంగళవారం రోజు 10600 మందికి బియ్యం, 7400 మందికి నగదును అందజేశారు. ఇంకా జిల్లాలో 9070 మందికి బియ్యం, 12270 మందికి నగదును అందజేస్తామని కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. చిన్నకోడూరులో 200 మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.500 నగదును జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అందజేశారు. మనూరు మండలం శెల్గిర, తిమ్మాపూర్‌, నారాయణఖేడ్‌ మండలంలోని సత్యగామ, కల్హేర్‌ మండల కేంద్రంలో మంగళవారం అధికారులు వలస కూలీలకు ప్రతి ఒక్కరికి 12కిలోల బియ్యం, రూ.500లు నగదును అందజేశారు. హత్నూర మండలం రొయ్యపల్లి, చందాపూర్‌, దౌల్తాబాద్‌ గ్రామాల్లో ఎంపీపీ వావిలాల నర్సింహులు, తహసీల్దార్‌ జయరాంలు వలసకూలీలకు రూ.500, 12కిలోల చొప్పున బియాన్ని పంపిణీ చేశారు. మునిపల్లి మండలంలో 70మందికి 12కిలోల చొప్పున ఎనిమిది క్వింటాళ్ల నలభైకిలోల బియ్యం, రూ.35వేల నగదును తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌ వలసకూలీలకు అందజేశారు. అదే విధంగా మామిడిపల్లిలో ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్‌ వలసకూలీలకు రూ.500, 12కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ములుగు మండలం సింగన్నగూడ పరిశ్రమల్లో పనిచేస్తున్న 99 మంది కార్మికులకు ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యం రూ.500ల పంపిణీ చేశారు. జిన్నారం మండలంలోని జంగంపేట సర్పంచ్‌ వెంకటయ్య, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌ బియ్యం, నగదును అందజేశారు. జహీరాబాద్‌ మండలంలోని శేకాపూర్‌లో బియ్యం, నగదును డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ పంపిణీ చేశారు. వట్‌పల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వలస కార్మికులకు  బియ్యం, నగదును తహసీల్దార్‌ ప్రేమలత అందజేశారు.


logo