శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Mar 20, 2020 , 00:55:46

లక్ష్యం దరికి..

లక్ష్యం దరికి..

  • జోరందుకున్న మున్సిపల్‌ ఆస్తి పన్ను వసూలు
  • టార్గెట్‌ రూ.4.80 కోట్లు
  • వసూలైంది రూ.2.83 కోట్లు  
  • వసూలు కావాల్సింది రూ.1.97 కోట్లు
  • ఈ నెల 31 వరకు గడువు 
  • ఆటోలలో విస్తృత ప్రచారం

మెదక్‌, నమస్తే తెలంగాణ : మెదక్‌ మున్సిపల్‌లో ఆస్తి పన్ను వసూలు జోరందుకున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మెదక్‌ మున్సిపల్‌ ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.4.80 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.2.83 కోట్లు వసూలైంది. ఇక పది రోజులు గడువు ఉండడంతో రూ.1.97 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. దీంతో మున్సిపల్‌ అధికారులు, సిబ్బం ది పన్ను వసూల కోసం పరుగులు తీస్తున్నారు. మెదక్‌ మున్సిపల్‌లో వంద శాతం వసూలు చేయాలన్న సంకల్పంతో ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల వరకే వార్డుల్లో తిరుగుతూ ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి యజనుమాలు ఆస్తి పన్ను చెల్లింపు విషయంలో సహకరించాలని సూచిస్తున్నారు. మున్సిపల్‌లోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. 

పట్టణంలో ఆటోలో విస్తృత ప్రచారం...

పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించాలని ఆటోలో ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 31 వరకు ఆస్తి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహ రి తెలిపారు. ఈ నెలాఖరు వరకు వంద శాతం పన్నులు వసూలు చేస్తామని చెప్పారు. ప్రతి రోజు పట్టణంలోని ఆయా వార్డుల్లో తిరుగుతూ ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఆర్వో జాన్‌కృపాకర్‌తో పాటు యూడీఆర్‌ఐ బట్టి రమేశ్‌, రెవెన్యూ విభాగం అధికారులు, బిల్‌కలెక్టర్లు, సిబ్బంది ఆస్తి పన్ను వసూల్లో నిమగ్నమయ్యారు. 

మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి...

 మున్సిపల్‌ పరిధిలో పేరుకుపోయిన ఆస్తి పన్నులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేశారు. మొండి బకాయిలు ఉన్న ఇంటి యజమానులు వెంటనే పన్నులు చెల్లించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు కూడా పెరిగిపోయాయని తెలిపారు.  ఆయా శాఖల అధికారులతో మాట్లాటడం జరిగిందని, వెంటనే చెల్లించేలా చూడాలని చెప్పడం జరిగిందన్నారు. logo