శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Mar 19, 2020 , 00:59:07

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

  • సెల్ఫీలు, ఫొటోలతో సందడి చేసిన విద్యార్థులు
  • వీడ్కోలు చెప్పుకొని వెనుదిరిగిన యువతీయువకులు
  • స్వగ్రామాలకు వెళ్లేవాళ్లతో కిటకిటలాడిన బస్టాండులు 

మెదక్‌ రూరల్‌ : ఈ నెల 4న  ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు సజావుగా ముగిశాయి. బుధవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కెమిస్ట్రీ-2, కామర్స్‌-2, సోషియాలజీ-2, ఫైన్‌ఆర్ట్స్‌ మ్యూజిక్‌-2 పరీక్షలకు 1579 మంది విద్యార్థులకు గాను 1450 మంది హాజరుకాగా  129 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి సూర్యప్రకాశ్‌ తెలిపారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు కేరింతలతో, ఆనందంగా స్నేహితులతో సెల్ఫీలు దిగుతూ బైబై చెబుతూ ఇంటి ముఖం పట్టారు. ఆయా గురుకుల కళాశాలల్లో ఉంటున్న విద్యార్థులు సామగ్రితో పయనమయ్యారు. కొందరు తల్లిదండ్రులు పరీక్ష అయ్యే వరకు ఉండి తమ పిల్లలను వెంట తీసుకెళ్లారు. ఇదిలాఉండగా ఒకేషనల్‌ విద్యార్థులకు మాత్రం ఈనెల 23 వరకు పరీక్షలు జరుగనున్నాయి. 

కిటకిటలాడిన బస్టాండ్‌..

ఒ పక్క ఇంటర్‌ పరీక్షలు ముగియడం, కరోనా కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు ముందస్తు సెలవులను ప్రకటించడంతో జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంగణం కిటకిటలాడింది. సెలవులతో విద్యార్థులు సోంతూళ్ల బాట పట్టారు. 


logo