శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Mar 17, 2020 , 00:39:20

‘డబుల్‌' జోష్‌

‘డబుల్‌' జోష్‌

సొంతిల్లు లేని నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. జిల్లాలో 5514 డబుల్‌ ఇండ్లు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో 4564, జిల్లా కేంద్రంలో అర్బన్‌ హౌసింగ్‌ స్కీం కింద 950 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా మొత్తంగా 5514 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు పిలువగా.. 3676 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు వచ్చాయి. అందులో 3115 ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 762 ఇండ్ల నిర్మాణాలు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు గూడు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. సీఎం కేసీఆర్‌ నిరుపేద లబ్ధిదారులపై ఒక్కపైసా భారం పడకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో అన్ని వసతులతో విశాలమైన డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారు. ఇప్పటికే వేలాది సంఖ్యలో ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, తాజా బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. దీంతో మరింత మంది పేదలకు సొంతింటి కల నెరవేరనున్నది.

  • జిల్లాలో 5,514 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు
  • 3,676 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు
  • శరవేగంగా 3,115 ఇండ్ల నిర్మాణాలు
  • సీఎం చేతుల మీదుగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవాలకు సన్నాహాలు
  • బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు భారీగా నిధులు
  • వ్యక్తిగత స్థలాల్లో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు అవకాశం
  • త్వరలో విధివిధానాలను వెల్లడించనున్న ప్రభుత్వం

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నిరుపేదలకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా  జరుగుతున్నాయి. జిల్లాకు 5,514 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో 4,564, జిల్లా కేంద్రమైన మెదక్‌లో అర్బన్‌ హౌసింగ్‌ స్కీం కింద 950 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా మొత్తంగా 5,514 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిస్తే 3,676 ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు వచ్చాయి. అందులో 3,115 ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 762 ఇండ్ల నిర్మాణాలు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ, విద్యుత్‌శాఖ, మిషన్‌భగీరథ అధికారులతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడూ సమీక్ష నిర్వహిస్తున్నారు. 3,115 ఇండ్లకు సంబంధించి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 762 ఇండ్లు నిర్మాణాలు పూర్తి కాగా, 318 ఇండ్లు ప్లాస్టరింగ్‌ పూర్తి కావచ్చాయి. 708 ఇండ్లు గోడల వరకు పూర్తయ్యాయి. 570 ఇండ్ల స్లాబుల వరకు నిర్మాణాల్లో ఉన్నాయి. 66 ఇండ్లు రూఫ్‌ లెవెల్‌ వరకు పనులు పూర్తయ్యాయి. 394 ఇండ్లు ప్లింత్‌ భీమ్‌ల వరకు పనులు పూర్తికావచ్చాయి. మరో 394 ఇండ్లు బేస్‌మెంట్‌ లెవల్‌లో పనులు పూర్తి కావచ్చాయి. 299 ఇండ్లు ఫౌండేషన్‌ లెవల్‌లో ఉన్నాయి. 

పిల్లికొటాల్‌లో 638 డబుల్‌ బెడ్‌రూంల ఇండ్ల నిర్మాణాలు పూర్తి.. 

జిల్లా కేంద్రమైన మెదక్‌లో పిల్లికొటాల్‌ సమీపంలో నిర్మాణమవుతున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లు 638 పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. నర్సాపూర్‌, హవేళిఘనపూర్‌, దంతాన్‌పల్లి, సికింద్లాపూర్‌, వెల్దుర్తి, రామాయంపేట, చల్మెడ, కల్వకుంట్ల, మిర్జాపల్లి, చిత్రయాల్‌, గాజులగూడెం సైతం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారులు పూర్తైన ఇండ్లకు తాగునీటి సరఫరా, విద్యుత్‌ కనెక్షన్లు, డ్రైనేజీ సిస్టమ్‌, పారిశుధ్యం (టాయిలెట్స్‌) తదితర వసతులు కల్పించేందుకు అధికారులతో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, అన్ని శాఖల అధికారులతో ఇటీవల మెదక్‌లోని పిల్లికొటాల్‌లోని డబుల్‌బెడ్‌రూం ఇండ్ల వద్ద సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి, వివిధ శాఖల ఈఎన్సీలతో మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడి నిధులు మంజూరు ఇవ్వాలని కోరారు. తాను ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, విద్యుత్‌ కనెక్షన్ల కోసం, మౌలిక సదుపాయాల కోసం తమ నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఇండ్లకు విద్యుత్‌ సౌకర్యంతో పాటు తాగునీరు, పారిశుధ్యం (టాయిలెట్స్‌), డ్రైనేజీ సిస్టమ్‌ను కల్పించాలని అధికారులను ఆదేశించారు.   

బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు భారీగా నిధులు..

గతంలో కంటే ఈ సారి బడ్జెట్‌లో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గృహ నిర్మాణాల కోసం బడ్డెట్‌లో భారీగా నిధులు కేటాయించడంతో జిల్లాలో ఈ సంవత్సరం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి గతంలో కంటే అత్యధికంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు కానున్నాయి. వ్యక్తిగతంగా స్థలాలు ఉన్న నిరుపేదలు స్వయంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించుకునేందుకు ఈ సారి ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్నది. దీంతో లబ్ధిదారులు మరింత మంది పెరుగుతారు. దీని సంబంధించి విధివిధానాలు వెలువడనున్నాయి.

5,514 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరు..

జిల్లాకు 5,514 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకుగాను 5,514 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిస్తే 3,676 ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు వచ్చాయి. అందులో 3115 ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. టెండర్లు పొంది ఇండ్ల నిర్మాణం చేపట్టని ఏజేన్సీలకు నోటీసులు జారీ చేశాం. 762 ఇండ్ల నిర్మాణం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. 5514 మంజూరైన ఇండ్లలో 950 ఇండ్లు మెదక్‌ పట్టణానికి మంజూరు కాగా, గ్రామీణ ప్రాంతల్లో 4564 ఇండ్లు మంజూరయ్యాయి. 

- పంచాయతీరాజ్‌ శాఖ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వర్‌రావు 


logo