మంగళవారం 31 మార్చి 2020
Medak - Mar 16, 2020 , 01:24:50

కొమురవెల్లి కిటకిట

కొమురవెల్లి కిటకిట
  • వైభవంగా మల్లన్న తొమ్మిదో వారం
  • సుమారు 40వేల మంది భక్తుల దర్శనం
  • సందడిగా మారిన ఆలయ ప్రాంతం

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జున  క్షేత్రం ఆదివారం భక్తులతో నిండింది. బ్రహ్మోత్సవాల్లో భాగం గా 9వ వారం సందర్భంగా రాష్ట్రం నుంచి భారీగా భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 9వ వారం సుమారు 40వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. స్వామివారి దర్శనం అనంతరం అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపు మొక్కులు తీర్చుకోవడంతోపాటు కోరికలు తీర్చాలని స్వామివారిని వేడుకున్నారు. కొండపై ఎల్లమ్మ తల్లికి మహిళల భక్తిశ్రద్ధలతో బోనా లు తయారు చేసి సమర్పించారు. కొందరు రాతిగీరల వద్ద ప్ర దక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి కోరికలు తీర్చాలని స్వామిని వేడుకున్నారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోష్‌, డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు. సభ్యులు నర్సింహు లు, నాగిరెడ్డి, బాల్‌రెడ్డి, అమర్‌గౌడ్‌, ఐలయ్య, ఏఈవో  శ్రీనివాస్‌, పర్యవేక్షకుడు శేఖర్‌, ప్రధానార్చకుడు మల్లికార్జున్‌, ఏఈ లు అంజయ్య, సిబ్బంది బీ. పోచయ్య, ఎం. పోచయ్య, విజయ్‌కుమార్‌, వెంకటచారి, జగదీశ్వర్‌, మాధవి, నర్సింహులు, కనకయ్య, అర్చకులు భక్తులకు సేవలందించారు.   

మల్లన్న దర్శనానికి భారీ బందోబస్తు

మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేసినట్లు ఏసీపీ మహేందర్‌ తెలిపారు. 9వ వారం సంద ర్భంగా చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి ఎస్‌ఐ నరేందర్‌ రెడ్డి తో కలిసి పార్కింగ్‌ ప్రదేశాలు, శీఘ్ర, వీఐపీ, సాధారణ దర్శన ప్రదేశాలు, క్యూలైన్లు, టెంపుల్‌ ఆవరణను పరిశీలించారు.  9వ వారం సందర్భంగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తు న్నట్లు తెలిపారు. పిక్‌ ప్యాకెటింగ్‌, దొంగతనాలు జరుగకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.


logo
>>>>>>