సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Mar 15, 2020 , 02:20:06

టార్గెట్‌ రూ.6.40కోట్లు

టార్గెట్‌ రూ.6.40కోట్లు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో రూ.6.40 కోట్లు పన్ను వసూలే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచే వార్డుల్లో పర్యటిస్తున్నారు. మెదక్‌ మున్సిపల్‌లో రూ.4కోట్ల 80లక్షలు పన్ను వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.2కోట్ల 24లక్షలను వసూలు చేశారు. తూప్రాన్‌ మున్సిపాలిటీలో రూ.65లక్షలకుగాను రూ.42లక్షల పన్ను వసూలైంది. నర్సాపూర్‌ మున్సిపల్‌లో రూ.54లక్షల 75వేలు పన్ను బకాయిలు ఉండగా, రూ.34లక్షల 91వేలు పన్నును వసూలు చేశారు. రామాయంపేట మున్సిపాలిటీలో రూ.41లక్షలు పన్ను వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.21లక్షలు వసూలైనట్లు మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరుతూ ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

  • జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం ఆస్తిపన్ను రూ.6.40వసూళ్లు
  • మెదక్‌ మున్సిపల్‌లో రూ.4కోట్ల 80లక్షలకుగాను, వసూలైంది రూ.2కోట్ల 24లక్షలు
  • తూప్రాన్‌ మున్సిపాలిటీలో రూ.65లక్షలకు రూ.42లక్షలు వసూలు
  • నర్సాపూర్‌ మున్సిపల్‌లో రూ.54లక్షలకు రూ.34లక్షల 91వేలు వసూలు
  • రామాయంపేట మున్సిపల్‌లో రూ.41లక్షలకు రూ.21 లక్షలు వసూలు
  • ఈ నెల 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం

మెదక్‌, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రమైన మెదక్‌ మున్సిపాలిటీలో వందశాతం పన్నుల వసూలే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును వందశాతం వసూలు చేయాలని నిర్ధేశించారు. మెదక్‌ మున్సిపల్‌లో లక్ష్యం రూ.4కోట్ల 80లక్షలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.2కోట్ల 24లక్షలు వసూలైంది. తూప్రాన్‌ మున్సిపాలిటీలో రూ.65లక్షలు లక్ష్యం కాగా, రూ.42లక్షలు వసూలయ్యాయి. నర్సాపూర్‌ మున్సిపల్‌లో రూ.54లక్షల 75వేలు డిమాండ్‌ కాగా, రూ.34లక్షల 91వేలు వసూలయ్యాయి. రామాయంపేట మున్సిపాలిటీలో రూ.41లక్షలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.21లక్షలు వసూలయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లించాలంటూ ఇప్పటికే విస్తృతంగా ఆటోలలో ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ఇంటి యజమానులకు మున్సిపల్‌ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. మరో 17 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మొండి బకాయిలను ఉపేక్షించబోమని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి మెదక్‌ మున్సిపాలిటీలో ఆస్తిపన్ను లక్ష్యం రూ.4కోట్ల 80లక్షలు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ.2కోట్ల 24లక్షలు వసూలు చేశారు. ఇంకా రూ.2కోట్ల 56లక్షలు వసూలు చేయాల్సి ఉన్నది. అంటే రోజుకు రూ.10లక్షల చొప్పున ఆస్తిపన్నును వసూలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నారు. తూప్రాన్‌ మున్సిపాలిటీలో రూ.23లక్షలు, నర్సాపూర్‌ మున్సిపాలిటీలో రూ.20లక్షలు, రామాయంపేట మున్సిపాలిటీలో రూ.20లక్షలు వసూలు కావాల్సి ఉన్నదని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా జిల్లాలోని నాలుగు మున్సిపల్‌ పరిధిలో ఆస్తిపన్ను సకాలంలో చెల్లించాలంటూ ఆటోలల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల కారణంగా మొదట్లో మందకొడిగా సాగిన ఆస్తిపన్ను వసూలులో ఇప్పుడిప్పుడే జోరందుకున్నది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉదయమే వార్డుల్లోకి వెళ్తున్న మున్సిపల్‌ బిల్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ఆస్తిపన్ను వసూలును పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మున్సిపల్‌ కార్యాలయాల్లో కూడా ఆస్తిపన్ను చెల్లింపునకు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. మెదక్‌ మున్సిపల్‌ పరిధిలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి ఆస్తిపన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నెలాఖరు వరకు వందశాతం వసూలే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రజలు ఆస్తిపన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.


logo