ఆదివారం 29 మార్చి 2020
Medak - Mar 10, 2020 , 00:34:38

మక్కజొన్న సాగు.. లాభాల పంట

మక్కజొన్న సాగు.. లాభాల పంట

నిజాంపేట: మక్కజొన్న సాగుతో లాభాలు అధికంగా వస్తాయని రైతులు యాసంగి సీజన్‌లో మక్కజొన్న పంటపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీళ్లతో పండే పంట కావడంతో రైతులు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. మండల వ్యాప్తంగా 1300 ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంటను సాగుచేస్తున్నారు. అధిక దిగుబడులు రావడమే కాకుండా పశుగ్రాసం కొరత తీరుతున్నది.


మార్కెట్‌లో మంచి డిమాండ్‌

మక్కజొన్న కంకులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నది. వరి, పత్తి పంటల తర్వాత తక్కువ నీళ్లు అవసరమయ్యే మక్కజొన్న పంటను పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని నగరం, జెడ్చెరువు, తిప్పనగుల్ల, చల్మెడ, నిజాంపేట, వెంకటాపూర్‌(కె), రాంపూర్‌ తదితర గ్రామాల్లో అధికంగా పంట సాగవుతున్నది. మక్కజొన్న పంటకు రెండుసార్లు తక్కువ మోతాదులో రసాయన ఎరువులను వేసి సరైన సమయంలో నీళ్లను అందిస్తే ఒక ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.


పశుగ్రాసానికి ఉపయోగం

మక్కజొన్న పంటతో పశుగ్రాసం కొరత కూడా తీరుతున్నది. అందుచేత ఈ పంటను సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.logo