శనివారం 28 మార్చి 2020
Medak - Mar 10, 2020 , 00:30:12

అగ్గితెగులు..జాగ్రత్తలు

అగ్గితెగులు..జాగ్రత్తలు

నర్సాపూర్‌ రూరల్‌: వరి పంటకు అగ్గితెగులు సోకడం వల్లన  దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. అగ్గితెగులు సోకకముందే తగిన చర్యలు తీసుకుని పంటను కాపాడుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు సలహాలు సూచలను చేశారు.


ముఖ్యంగా వరిలో అగ్గితెగులకు సంబంధించి రెండు అంశాలు..మొదటిది అగ్గితెగుల లక్షణాలను మొక్కలలో గుర్తించడం,రెండోది అగ్గితెగులు నివారణకు మందులు వేయడం


అగ్గితెగులు లక్షణాలు...

ఆకుల మీద తొలిదశలో నూలుకండే ఆకారంలో మచ్చలు ఏర్పడుతాయి. ఆకులపై వచ్చే మచ్చల అంచులు ముదురు ఎరుపు రంగులో ఉండి మధ్యలో తెలుపు రంగులో ఉంటాయి. క్రమేపి ఈ మచ్చలు ఒకదానినొకటి కలిసిపోయి ఆకు మొత్తం కాలిపోయినట్లు కనిపిస్తాయి. ఈ అగ్గితెగులు సోకిన పంటను దూరం నుంచి చూస్తే పంట కాలిపోయినట్లు అనిపిస్తుంది.


అగ్గితెగులు ఎక్కువగా రావడానికి కారణాలు

  • వరిపంటకు నత్రజని అధిక మొత్తంలో వాడినప్పుడు రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉన్నపుడు
  • పగటిపూట ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ ఉన్నపుడు
  • గాలిలో తేమ శాతం 90శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు
  • జల్లులు, మబ్బుతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు
  • వారం రోజుల పాటు మంచు కురిసినప్పుడు
  • వరి గట్లపై గిడ్డుజాతి కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు


అగ్గితెగుల నివారణ

ట్రైసైక్లసోల్‌ 75 శాతం డబ్ల్యూపీ, కాసుగామైసిన్‌ 3శాతం ఎస్‌ఎల్‌, పైరక్లోస్ట్రోబిన్‌ 10శాతం సీఎస్‌, క్రెసోక్సిమ్‌ మెథైల్‌ 44.3శాతం ఎస్సీ, టెబ్యూకొనజోల్‌ 25.9 శాతం ఈసీ, ఐసోప్రోతైయాలాన్‌ 40శాతం ఈసీ మందులలో ఏదో ఒక మందును వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పిచికారి చేసుకుని అగ్గితెగులని నివారించుకోవచ్చు.


logo