గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Mar 09, 2020 , 03:51:27

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
  • మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్‌
  • షీటీం, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి
  • జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌
  • మహిళా దినోత్సవంలో భాగంగా మనోహరాబాద్‌ మండలం జీడిపల్లిలో సంబురాలు

మనోహరాబాద్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని జెడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలం జీడిపల్లిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా గ్రామ మహిళలతో కేక్‌కట్‌ చేసి కలిసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం మనోహరాబాద్‌ పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, నగదు బహుమతిని అందజేశారు. మహిళా పారిశుధ్య కార్మికుల నిర్వహణ చాలా కష్టతరమైందని, కానీ గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం కోసం ఎంతగానో శ్రమిస్తారని అభినందించారు. అంతకుముందు కాళ్లకల్‌లో రాఘవేంద్ర దవాఖాన, బోయిన్‌పల్లి వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్‌, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్‌ ముదిరాజ్‌, ఎంపీటీసీ నత్తి లావణ్య, సర్పంచులు రేఖమల్లేశ్‌ ముదిరాజ్‌, శ్యామల వెంకటేశం, మాజీ జెడ్పీటీసీ నారాగౌడ్‌, వార్డు మెంబర్లు ఆంజనేయులు, కొమురెల్లి, నాయకులు శ్రీరామ్‌, అశోక్‌, ప్రభాకర్‌, రవి పాల్గొన్నారు.


logo
>>>>>>