సోమవారం 06 ఏప్రిల్ 2020
Medak - Mar 06, 2020 , 00:40:58

కరోనాపై కంగారొద్దు

కరోనాపై కంగారొద్దు
 • ఆందోళన చెందాల్సిన అవసరం లేదు...
 • డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు
 • పరిశుభ్రత పాటిస్తే మేలు
 • హెల్ప్‌లైన్‌లైన్‌ నంబర్లు 08452-221271, 7331186780
 • జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ పి.చంద్రశేఖర్‌

మెదక్‌, నమస్తే తెలంగాణ  : రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదని, విదేశాల నుంచి వచ్చిన ఒక  వ్యక్తికి పాజిటివ్‌గా తేలడంతో గాంధీలో చికిత్సలు అందిస్తున్నారని జిల్లా వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని.. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని  డీఎంహెచ్‌వో  వెంకటేశ్వర్‌రావు, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌  పి.చంద్రశేఖర్‌ తెలిపారు. వేడి ఉష్ణోగ్రతలో ఆ వైరస్‌ బతకదని, అయినా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలని వారు తెలిపారు. షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవడం మేలని, చేతులు ఎప్పడికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు గుమికూడే ప్రదేశాలకు  వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. ఎవరికైనా సందేహాలుంటే జిల్లా కేంద్ర దవాఖానలో హెల్ప్‌లైన్‌ 08452-221271, డీఎంహెచ్‌వో కార్యాలయం నంబర్‌ 7331186780లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు. 


శ్వాస, స్పర్శ, మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం ద్వారా ‘కరోనా’ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతు న్నారు. అత్యంత రద్దీ కలిగిన ప్రదేశాల్లో తిరుకగకపోవడం, దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, చేతులతో కరచాలనం చేయడం, వ్యాధి ప్రభావిత వ్యక్తి తాకిన వస్తువుల ద్వారా వ్యాప్తిచెందే అవకాశం ఉంటుది. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాలు ప్రస్తుతానికి స్థానికంగా లేవు. 


నివారణ ఒక్కటే మార్గం..

కరోనా వైరస్‌ సోకకుండా ఉండటానికి నివారణ ఒక్కటే మార్గం. ముఖ్యంగా శుభ్రత పాటించాలి. షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండా దూరం నుంచే నమస్కారం చేయాలి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు వెళ్లే వారంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. అయితే జలుబు, దగ్గు, తీవ్ర తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ప్రభుత్వ దవాఖానలోని వైద్యులను సంప్రదించాలి. జిల్లా కేంద్ర దవాఖానలో  ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం గాంధీ దవాఖానకి తరలించడం జరుగుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు.


జిల్లాలో వైద్య శాఖ అప్రమత్తం.. 

జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాధికి సంబంధించి ఎలాంటి సూచనలు లేవని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే కరోనా వైరస్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. 


మాస్కులు ధరించడం మంచిది..

 • ముఖానికి మాస్క్‌ ధరించడం మంచిది. చుట్టూ ఉన్న వాళ్లు మనల్ని అనుమానిస్తారనే భయం ఉండటం సహజం. మాస్కులు వాడటం మంచిదని వైద్యాధికారులు చెబుతున్నారు. లేకపోతే చేతి రుమాలైనా ముఖానికి కట్టుకుంటే మేలు. ఇతరులకు కరచాలనం, ఆలింగనం ఇవ్వకపోవడం ఉత్తమం. తుమ్ములు, దగ్గులు వస్తే చేయి కాకుండా టిష్యూలు వాడండి. ముక్కు, కండ్ల ద్వారానే ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వాటిని చేతుల ద్వారా నలపకపోవడం మంచిది.
 • ఇవి చేయాల్సినవి.. 
 • చేతులు అపరిశుభ్రంగా ఉంటే సబ్బుతో బాగా కడుక్కోవాలి. ఆల్కహాల్‌ బేస్‌ ఉన్న శానిటైజర్‌, సబ్బు లాంటి వాటితో శుభ్రం చేసుకోవాలి.
 • వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధ్యానత ఇవ్వాలి. 
 • దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి గుడ్డను అడ్డంగా పెట్టుకోవాలి.


ఇవి చేయకూడనివి..

 • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం చేయకూడదు. జంతువులకు బాగా దగ్గరగా ఉండకూడదు. పచ్చిగా లేదా సరిగ్గా ఉడకని మాంసాహారాన్ని తీసుకోకూడదు. 
 • దగ్గు, జ్వరం లాంటివి ఉన్న వారితో ఎక్కువ సేపు కలిసి ఉండటం లాంటివి చేయొద్దు.
 • జంతువులను లేదా జంతువుల మాంసాన్ని విక్రయించే ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.


జాగ్రత్తలు..

 • ఈ వైరస్‌ గాలిలో ఉండదు. నేలపైనే ఉంటుంది. కరోనా వైరస్‌ ఏదేని లోహపు ఉపరితలం మీద 12 గంటలు ఉండగలదు. సబ్బుతో చేతులను శుభ్రపర్చుకుంటే సరిపోతుంది.
 • కరోనా వైరస్‌ కణాలు చాలా పెద్దవి. సుమారు 400 నుంచి 500 మైక్రో సైజులో ఉంటాయి. అందుకే ఏ మాస్క్‌ వాడినా వైరస్‌ లోనికి చేరే అవకాశం తక్కువ ఉంటుంది.
 • వైరస్‌ వేడి ప్రదేశాల్లో బతుకలేదు. 26-27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే చనిపోతుంది. వేడి చేసిన నీరు తాగడం, ఎండలో నిలబడటం లాంటివి చేయాలి. కొన్నాళ్లు ఐస్‌క్రిమ్‌ లాంటి చల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. 
 • కొన్ని రోజుల పాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది.కరోనాపై భయం వద్దు.. 

కరోనా వైరస్‌ జిల్లాలో ఎవరికీ సోకలేదు. కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉన్నది. అనుమానం ఉన్న వారి నమూనాలు తీసుకుని అవసరమైతే హైదరాబాద్‌కు పంపిస్తాం. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో ఆందోళన వద్దు. ఎవరికైనా సందేహాలు ఉంటే సంప్రదించడానికి డీఎంహెచ్‌వో కార్యాలయంలో నం : 7331186780ను అందుబాటులో ఉంచాం.

-  డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో మెదక్‌ 


వదంతులను నమ్మొద్దు..

కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దు. కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కేంద్ర దవాఖానలో హెల్ప్‌లైన్‌ నం : 08452-221271ను అందుబాటులో ఉంచాం. అంతేకాకుండా అనుమానితులను వెంటనే గాంధీ దవాఖానకి తరలించే ఏర్పాట్లు చేస్తాం. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- పి.చంద్రశేఖర్‌, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌logo