శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Mar 06, 2020 , 00:36:07

‘కాళేశ్వరం’తో కరువు దూరం..

‘కాళేశ్వరం’తో కరువు దూరం..

చేగుంట : ‘కాళేశ్వరం’తో కరువు అనే మాట లేకుండా సంవత్సరం పొడవునా చెరువుల్లో నీళ్లు ఉండబోతున్నాయని జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు అన్నారు. నార్సింగ్‌ మండల కేంద్రంలో అంగన్‌వాడీ భవనం, సీసీరోడ్లు, జిల్లా ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. దీంతో పాటు కల్యాణలక్ష్మి, రైతుబీమా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ‘కాళేశ్వరం’తో కరువు అనే మాట లేకుండా సంవత్సరం పొడవునా చెరువుల్లో నీళ్లు ఉండబోతున్నాయన్నారు.  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 


నార్సింగ్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలకు రూ.5లక్షల నిధులు..

నార్సింగ్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల కోసం రూ.5 లక్షలను మంజూరు చేస్తున్నట్లు జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అదే విధంగా నార్సింగ్‌ పాఠశాలలో డిజిటల్‌ క్లాసుల కోసం ఎమ్మెల్యే రామలింగారెడ్డి రూ.50వేలు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రూ.16వేలు, జెడ్పీటీసీ రూ.15వేలను పాఠశాలకు అందజేశారు. 


కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత, జెడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శంకర్‌గౌడ్‌, మండల ప్రత్యేకాధికారి వసంతసుగుణ, ఎంపీడీవో ఆనంద్‌మేరీ, తహసీల్దార్‌ విజయలక్ష్మి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రం అశోక్‌, ఎంపీటీసీలు సత్యనారాయణ, సుజాత, సంతోష, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కౌర్యానాయక్‌, నాయకులు శ్రీపతిరావు, లింగారెడ్డి, రాజేందర్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. 


logo