శనివారం 28 మార్చి 2020
Medak - Mar 05, 2020 , 00:41:06

ఇంటర్‌ పరీక్షలు షురూ..

ఇంటర్‌ పరీక్షలు షురూ..

మెదక్‌ రూరల్‌ : బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు జిల్లాలో సజావుగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షకు 8,527 మంది విద్యార్థులకు గాను 7,631 మంది విద్యార్థులు హాజరు కాగా 626 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్‌ జిల్లా నోడల్‌ అధికారి సూర్యప్రకాశ్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే అనుమతించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా డిబార్‌కు కానీ, మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడలేదని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 92.42 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, కేవలం 7 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరుకాలేదన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు సూర్యప్రకాశ్‌ తెలిపారు. 


జిల్లా కేంద్రంలో...

జిల్లా కేంద్రం మెదక్‌లోని ఏడు పరీక్ష కేంద్రాల్లో 2,167 మంది విద్యార్థులకు గాను 2,017 మంది హాజరుకాగా 150 మంది గైర్హాజరయ్యారు.


logo