గురువారం 02 ఏప్రిల్ 2020
Medak - Mar 05, 2020 , 00:23:31

‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం

‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం

నర్సాపూర్‌,నమస్తేతెలంగాణ: కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం నర్సపూర్‌ పట్టణంలోని ఐబీ కార్యాలయం ఆవరణలో నర్సాపూర్‌ మండలానికి మంజూరైన 41 కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, పాస్‌ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడపిల్లల పెండ్లి కోసం ప్రభుత్వం రూ.100116 చెక్కులను అందజేస్తుందని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ పనిచేస్తుందని, రైతులు, పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను నింపనున్నట్లు చెప్పారు.  


బాధిత కుటుంబానికి చెక్కు పంపిణీ 

నర్సాపూర్‌ మండల పరిధిలోని మూసపేట గ్రామానికి చెందిన నాగమొల్ల పోచమ్మ సంవత్సరం క్రితం గ్రామంలో కరెంటుషాక్‌తో మృతి చెందింది. బుధవారం నర్సాపూర్‌ పట్టణంలోని ఐబీ కార్యాలయం ఆవరణలో రూ.4లక్షల 50వేల చెక్కును పోచమ్మ భర్త యాదయ్యకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, ఆర్డీవో అరుణారెడ్డి, టీఆర్‌ఎస్‌ నర్సాపూర్‌ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ మాలతి, ఎంపీపీ జ్యోతి, జెడ్పీటీసీ బాబ్యానాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శేఖర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు జగదీశ్‌, హబీబ్‌ఖాన్‌ ఉన్నారు. 


శివ్వంపేటలో.. 

మనోహరాబాద్‌ : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరమని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండల కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంతో ఇంటికి పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్‌ నిలిచారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంలో అవకతవకలకు చోటు లేకుండా నిజమైన లబ్ధిదారులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు సూచించారు. గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా మిషన్‌ భగీరథతో గోదావరి జలాలను అందించనున్నట్లు తెలిపారు. శివ్వంపేటలో అతిపెద్ద సంపును ఏర్పాటు చేయనున్నామని, అందుకు అవసరమయ్యే నిధులను మంజూరు చేశామన్నారు. అనంతరం శివ్వంపేటలోని రైస్‌మిల్‌ వద్ద మిషన్‌భగీరథ సంపు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో అరుణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జెడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ పబ్బా మహేశ్‌గుప్తా, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ భానుప్రకాశ్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు కల్లూరి వెంకటేశ్‌, లక్ష్మీనర్సయ్య, శివరామగౌడ్‌  పాల్గొన్నారు. 


logo