ఆదివారం 29 మార్చి 2020
Medak - Mar 04, 2020 , 01:16:01

పలు గ్రామాల్లో సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల పర్యటన

పలు గ్రామాల్లో సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల పర్యటన

సిద్దిపేట రూరల్‌ : వివిధ రాష్ర్టాల నుంచి సివిల్‌ సర్వీసెస్‌లో ఎంపికై శిక్షణలో భాగంగా  అధికారులు మంగళవారం మండల పరిధిలోని ఇర్కోడులో పర్యటించారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాలను, పాఠశాలలను, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, చికెన్‌ మటన్‌ చట్నీ తయారీ విధానం, హరితహారంలో నాటిన మొక్కలు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమన్నారు.  వివిధ ప్రదేశాల నుంచి క్షేత్రస్థాయి  పర్యటనకు వచ్చామన్నారు. కానీ, అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉందన్నారు. ఈ గ్రామంలో చాలా అభివృద్ధి  జరిగిందన్నారు. గ్రామస్తుల ఐకమత్యం, అధికారుల పర్యవేక్షణ చాలా బాగుందని కితాబిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవన్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ భాగ్యలక్ష్మి, వీఆర్‌వో బాలనర్సయ్య తదితరులు ఉన్నారు. 

మిట్టపల్లిలో..

సిద్దిపేట అర్బన్‌ : సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గ్రామంలో మంగళవారం సివిల్‌ సర్వీసెస్‌ అధికారు లు (అఖిల భారత సర్వీస్‌ శిక్షణార్థులు) మల్హోత్రా, వివేక్‌కుమార్‌, జాదవ్‌సాగర్‌, విశాల్‌నర్వద్‌, మనోహర్‌ సింఘాల్‌, తదితరులతో కూడిన బృందం పర్యటించింది. గ్రామ ఈవో పీఆర్డీ రాజ్‌కుమార్‌తో కలిసి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, బీసీ హాస్టల్‌ తదితర వాటిని సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు బోధిస్తున్న తీరు, విద్యారంగం అభివృద్ధి, పాఠశాలలో రికార్డుల నిర్వాహణ, పాఠశాలకు నిధులు తదితర అన్ని అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం పరిశీలనతో పాటు కొద్దిసేపు విద్యార్థులకు అధికారులు భోజనం వడ్డించారు. అంగన్‌వాడీ కేంద్రంలో ప్ర భుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారం పంపిణీని  పరిశీలించారు.  బీసీ వసతి గృహంలో భోజనం తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారుల బృందంతో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఉన్నారు. 


logo