బుధవారం 01 ఏప్రిల్ 2020
Medak - Mar 04, 2020 , 01:15:26

స్వయంపరిపాలనలో విద్యార్థుల సందడి

స్వయంపరిపాలనలో విద్యార్థుల సందడి

మనోహరాబాద్‌: మనోహరాబాద్‌ మండలం పోతారం ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం స్వయంపరిపాలన కార్యక్రమాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులను అందజేశారు. 

న్యూ హైస్కూల్‌లో 

మెదక్‌టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలో స్వయం పరిపాలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధాయులు అమ్జద్‌అలీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మర్పల్లి ప్రాథమిక పాఠశాలలో

రేగోడ్‌: మండల పరిధిలోని మర్పల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయంపరిపాలన డేను మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాజు, ఉపాధ్యాయులు సుప్రియ, మహేశ్‌యాదవ్‌, జైపాల్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ గోపాల్‌ పాల్గొన్నారు.

శ్రీవిద్య పాఠశాలలో

పాపన్నపేట: మండల కేంద్రంలోని శ్రీవిద్య పాఠశాలలో మంగళవారం  స్వయం పాలనను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.  ప్రతిభ కనబర్చిన వారికి పాఠశాల హెచ్‌ఎం రవీందర్‌గుప్తా బహుమతులు అందజేశారు.  


logo
>>>>>>